ఆ టీవీ షో కి జూ.ఎన్టీఆర్ ఎంత రెమ్యూనరేషన్ తీసుకోబోతున్నాడో తెలుసా?
ప్రస్తుతం యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ “ఆర్ఆర్ఆర్” చిత్ర షూటింగ్ లో బిజీగా ఉన్నారు. ఈ సినిమా తర్వాత జూనియర్ ఎన్టీఆర్ మరోసారి హోస్టుగా కనిపించబోతున్నాడట…

ఇప్పటికే తారక్ బిగ్బాస్ సీజన్ హోస్ట్ గా అలరించి… అందరి మన్ననలు అందుకున్నాడు… ఈ బిగ్ బాస్ మూడు సీజన్లలో ఇద్దరు హోస్టులగా నాని, అక్కినేని నాగార్జున చేసిన…కానీ బిగ్ బాస్ హోస్ట్ గా ఎన్టీఆరే బెస్ట్ అని ప్రేక్షకులు అభిప్రాయపడుతున్నారు..

దీంతో యువతలో భారీ క్రేజ్ పెరగడంతో జెమినీ టీవీ యాజమాన్యం జూనియర్ ఎన్టీఆర్ ని హోస్ట్ గా పెట్టి.. ఒక షో ని ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నారని తెలిసింది. దీంతో ప్రేక్షకులు ఈ షోపై భారీ ఆశలు పెట్టుకున్నారు.

ఈ షో .”మీలో ఎవరు కోటీశ్వరుడు” లాంటి టీవీ షో లాగా ఉంటుందట… మరి ఈ షో కి జూనియర్ ఎన్టీఆర్ అసలు రెమ్యూనరేషనే తీసుకోవడం లేదట… ఎందుకంటే ఆ షో కి తారక్ నిర్మాతగా వ్యవహరిస్తున్నాడట. .

