ఆమె కోసం మెట్రో పరుగు!

hyderabad metro తెలంగాణ రాజధాని హైదరాబాద్ ని వరదలు ముంచేతున్నవేళ, చిన్న పెద్ద రోడ్లన్నీ చెరువులను తలపిస్తున్నవేళ, ఒక గర్బనీ మహిళా తన గమ్యస్థానానికి ఎలావెళ్ళలో తెలీక నరకయాతన పడుతున్నవేళ, మేమున్నాము అంటూ మెట్రో అధికారులు వారి దయా హృదయంతో ఆ గర్బనీ మహిళకు ఆపన్న హస్తం అందించారు.
ఈ నెల 14వ రోజు పెద్ద ఎత్తున వర్షాలు పడుతున్నవేళ LB నగర్ – మియాపూర్ దారిలో కొత్తపేట మెట్రో స్టేషనుకు రాత్రి 10 గంటలకు తనకు ఎలాగైనా మియాపూర్ చేరేలా సహాయం చేయాలనీ వేడుకోగా, మేమున్నామని మెట్రో సిబ్బంది ముందుకు వచ్చి తనని మియాపూర్ కి క్షేమంగా చేర్చారు.
మెట్రో టైమింగ్స్ ఉదయం 7గంటలనుండి రాత్రి 9 గంటలవరకు మెట్రో నడుస్తుంది. అలాగే ఆపదలో ఉన్న ఎవరినైనా ఆడుకొనేవిదంగా మెట్రోకీ నిబంధనలు ఉన్నాయి.
అందుకనే మెట్రో సిబ్బంది వారి నిబంధనలు పాటిస్తూ, మానవత్వం తో ఆ గర్భిణీ ని 10.40ని లకు మియాపూర్ చేర్చడం జరిగిందని, మెట్రో MD. NVS రెడ్డి తెలిపారు.