Today Telugu News UpdatesTollywood news in telugu

ఆన్లైన్ యాప్ లలో లోన్ తీసుకుంటున్నారా, అయితే ఇది తెలుసుకోండి

గిరి గిరి , ఫైనాన్స్ తల దన్నే రూపంలో ఆన్లైన్ లోన్ ల రూపంలో వివిధ సంస్థలు కొంత మంది అమాయక యువకులను , విద్యార్థులను టార్గెట్ చేస్తూ లోను తీసుకునేలా ప్రేరేపి స్తున్నాయి . లోన్ తీసుకున్నప్పుడు ఎంత తీసుకుం టున్నాం ఎంత కడుతున్నాము అనే విషయాన్ని కూడా మర్చిపోయి మరి లోను తీసుకుంటున్నారు . తిరిగి కట్టే సమయానికి అది చాలా ఎక్కువ అని తెలిసి లబోదిబో మంటున్నారు . వారు తీసుకునే వడ్డీ ని చూస్తే దిమ్మతిర గాల్సిందే . 10 నుంచి 30 శాతం వరకు నా రకాల ఫీజులు పేరున వసూలు చేస్తూ మరి యదేచ్చగా వీరి వ్యాపారం కొనసాగిస్తున్నారు .

సామాజిక మాధ్యమాల ద్వారా ఎస్ఎంఎస్ల ద్వారా వీరి దందా సాఫీగా చేసు కుంటూ పోతున్నారు . సోషల్ మీడియా లో ఏదైనా వీడియో చూస్తున్న మధ్యలో ఈ ఆన్లైన్ లోన్ కు సంబం ధించిన కొన్ని సంస్థలు తమ యాడే లను ఇస్తూ విద్యా ర్థులకు గాలం వేస్తున్నాయి . అది చూసిన విద్యార్థులు తమ మొబైల్ నంబర్లో ఈ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని దానిలో వీరి ఫోన్ నెంబర్ తో ఆధార్ కార్డు లింక్ చేస్తూ సెల్ఫీ ఫోటో దిగి లోన్ కు అప్లికేషన్ చేస్తున్నారు .. వెంటనే లోన్ కు సంబంధించిన ఈ సంస్థ నుంచి వీరికి మొదటగా ఎంతోకొంత అర్హత వచ్చిందని చెప్పి , సుమారు ఐదు వందల నుంచి వీరి దందా కొనసాగిస్తు న్నారు . ఒక వెయ్యి రూపాయలు లోన్ అర్హత వస్తే దానికి ప్రాసెసింగ్ ఫీజు అని జిఎస్టి అని వివిధ రకాల టాక్స్ ల పేరుతో చివరకు 700 నుంచి 750 రూపాయలు లోపు డబ్బులు బ్యాంక్ అకౌంట్లో జమ చేస్తు న్నారు . దానికి కాలవ్యవధి ఏడు రోజులకు మించి ఇవ్వ కుండా ఏడు రోజులకు వెయ్యికి పైగా వసూలు చేయడం గమనార్హం .

ఆన్లైన్ యాప్ లలో లోన్

వారం రోజులకే వెయ్యి రూపా యలకు సుమారుగా 250 నుంచి 300 రూపాయలు అదనంగా కడుతున్నారంటే వాళ్ళ దోపిడీ ఏ విధంగా ఉందో తెలుస్తుంది . ఏడు రోజుల లోపు వడ్డీతో సహా తిరిగి చెల్లిస్తే అదే సమయానికి 1500 అర్హత వచ్చిం దంటూ చూపిస్తూ మరోసారి లోను తీసుకునేలా చేస్తు న్నాయి . దీనికి కూడా వివిధ రకాల ఫీజులు అంటూ తిరిగి మళ్ళీ డబ్బులు బాదుతున్నారు . ఇలా ఇలా ఐదు వందలు వెయ్యి నుంచి మొదలైన ఈ లోను సుమారు 50 వేల వరకు తీసుకెళ్లి చేస్తున్నారు . కాల పరిమితి కూడా ఏడు రోజుల గడువు నుంచి మూడు నెలలు గడువు వరకు పెంచుతూ అధిక వడ్డీ , వివిధ రకాల ఫీజులతో కోట్లలో గడుస్తున్నాయి . ఇలా చెప్పుకుంటూ లోన్ మోసాలకు అడ్డూ అదుపూ లేదు .

లోన్ తీసుకున్న విద్యార్థులు ఆ లోను కట్టే సమయానికి చేతిలో డబ్బు లేకపోవడంతో వారి వద్ద తల్లిదండ్రులు ఇచ్చిన విలువైన సామాన్లను అమ్మి మరి లోన్లు కడుతున్నారు . కొంతమంది . లోన్ కట్టేందుకు డబ్బులు లేక దొంగత నాలు కూడా చేసే ప్రమాదం కూడా లేకపోలేదని పలువురు చెబుతు న్నారు . లోన్లు తీసుకున్న విద్యార్థులు వడ్డీ రూపంలో వేల రూపాయలు కట్టిన వాళ్ళు కూడా ఉన్నారు . లోను సకాలంలో చెల్లించకపోతే వీళ్లు వేసే వడ్డీ ఇంత అంత ఉండదు . ఒకవేళ ఏడు రోజులకు సంబంధించి వ్యవధి వస్తే ఏడు రోజులు దాటిన తర్వాత నెల రోజులు రెండు నెలలు మూడు నెలల్లోపు వీళ్లు తీసుకున్న అసలు కంటే వడ్డీ ఎక్కువ అవుతుంది అనడంలో ఎలాంటి సందేహం కూడా లేదు . మందర నుంచి మొదలైన వీరి లోన్లు మేలలో పోయేసరికి వడ్డీ విపరీతంగా పెరగడంతో కట్ట లేక నానా రకాల ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు .

10 వేల 50 వేల వరకు ఇచ్చే అసలు కు రెండు మూడు నెలల వ్యవధి ఇవ్వడంతోపాటు వడ్డీ అధిక రేట్లో ఉండడంతో కట్టలేక ఇబ్బందులు కూడా ఎదుర్కొంటున్నారు . కొంతమంది తీసుకున్న మొత్తానికి కాలవ్యవధి దాటిన ఆరు నెలల లోపే తీసుకున్న మొత్తాన్ని కంటే వడ్డీనే ఎక్కువ అవడం గమనార్హం . ఇలానే ఆన్లైన్ లోన్ సంస్థలు విద్యార్థులను పెంచుకుంటూ పోతే ఇది ఎక్క డికి వెళ్తుందో ఎలాంటి దుష్పరిణామాలు చోటు చేసు కుంటాయో అని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తు న్నారు . అన్ని బ్యాంకుల పై నియంత్రణ ఉండే ఆర్బి బ్యాంక్ ఇలాంటి ఆన్లైన్ లోన్ సంస్థలపై ఒక కన్ను వేసి ఉంచాలని , వారిపై నియంత్రణ చర్యలు చేపట్టాలని పలువురు కోరుతున్నారు .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button