Tollywood news in telugu
ఆడ నెమలి అనే మరో కొత్త పాటతో… మన ముందుకు వచ్చిన:- మంగ్లీ

మంగ్లీ అనంతపురం జిల్లా గుత్తి మండలంలోని ,బసినేపల్లె తాండలో పేద బంజారా కుటుంబంలో జన్మించింది.తాండ లో 5 వరకు చదివింది.తరవాత 6 నుండి 10 తరగతి వరకు గర్ల్స్ హై స్కూల్ లో చదివింది.
ఆమె జీవితం మలుపు మాత్రం RDT (Rural Development Trust) సంస్థ ద్వారా తిరిగింది. . RDT చొరవతో సంగీతం పై పట్టు సాధించి తిరుపతి లోని సంగీత విద్యాలయంలో పూర్తి మెళకువలు నేర్చుకుని, ఆ తరువాత తన కెరియర్ మొదలు పెట్టి తెలంగాణ లో పల్లె పాటలు పాడుతూ, తీన్మార్ పొగ్రాంతో టీవీ ఛానల్స్ లోకి ఎంటర్ అయి జనాలకు పరిచయమైంది.
అయితే మంగ్లీ యాస భాష చూసి తను తెలంగాణకు సంబంధించిన వ్యక్తిగా అనుకుంటారు.
తానేంటో నిరూపించుకుంటూ ముందుకుసాగుతున్న ఈ గాయని,నటి,టీవీ వ్యాఖ్యాత గా రాణించుతూ, ఉత్తమ జానపద కళాకారిణిగా పురస్కారం అందుకొని ఎంతోమంది అభిమానులను తన పాటతో ఆటతో యువతరాన్ని ఉర్రూతలు ఉగిస్తుంది .