ఆకతాయి తండ్రి చేతిలో బలి అయిన ఆటో డ్రైవర్

ఈ రోజుల్లో అమ్మాయిలకి తన కుటుంబ సభ్యులు పక్కన ఉన్న ఈ ఆకతాయిల ఆగడాలకు హద్దు,అదుపు లేకుండా పోతుంది. ముక్యంగా ఇది ఎక్కువగా హైదరాబాద్ లోనే జరుగుతుంది.
కుటుంబ సభ్యులు తో వెళ్తున్న అమ్మాయిలకు కూడా ఈ వేధింపులు తప్పట్లేదంటే, ఇక ఒంటరిగా వెళ్లే మహిళల బాధలు ఎలా ఉంటాయో చెప్పనక్కర్లేదు.
ఈ హత్యకు సంబంధించి వివరాల్లోకి వెళ్తే, ఒక కొడుకు తప్పుచేస్తే తండ్రి మందలించి, మంచి బుద్దులు చెప్పి మార్చాలి. కానీ ఇక్కడ కొడుకు ఒక అమ్మాయిని వేధిస్తూ ఉంటే ఆ కొడుకుకి మద్దతు తెలిపే సంఘటన చోటుచేసుకుంది.
కుత్బుల్లా పూర్ ఏరియాకి చెందిన పావని(28) నర్స్ గా పనిచేస్తున్న ఒక మహిళ, తన సోదరుడు (పవన్)తో బండిపై వెళ్తుంటే, సందీప్ అనే ఆకతాయి పావనిని వేధింపులకు గురిచేశాడు. ఈ సంఘటనని జీర్ణించుకొని పవన్, సందీప్ ఇంటి దగ్గర ఉన్న పవన్ ఫ్రెండ్ సురేష్ గౌడ్(ఆటో డ్రైవర్) కి జరిగిన విషయాన్నీ వివరించాడు.
అపుడు పవన్ ఫ్రెండ్ సురేష్ , సందీప్ ఇంటికి వెళ్లి సందీప్ ని మందలించాడు. ఇదే సమయంలో సందీప్ కి, సందీప్ తండ్రి విజయ్ బోస్ తో, సురేష్ కి మధ్యన గొడవ ఎక్కువ కావడంతో, విజయ్ బోస్ సురేష్ ని కత్తితో విచక్షణ రహితంగా దాడి చేయడంతో సురేష్ ని హాస్పిటల్ కి తీసుకెళ్లిన అధిక రక్తస్త్రావం వల్ల తిరిగి రానిలోకాలకు వెళ్ళిపోయాడు.