అన్నీ నేర్పించిన అద్భుతమైన సంవత్సరం 2020 అంటూ… చెప్పుకొచ్చిన పూరీ జగన్నాథ్ !

పూరీ జగన్నాథ్ తన ‘పూరీ మ్యూజింగ్స్’లో మాట్లాడుతూ.. ఒక అద్భుతమైన సంవత్సరం 2020 అని వ్యాఖ్యానించారు. గత సంవత్సరం ఎటువంటి అనుభూతులను మిగిల్చిందో తన మాటల్లో తెలియజేసాడు.
ప్రతి ఒక్కరు 2020ని తిట్టుకుంటున్నారు. కానీ, మన జీవితం లో ఎలాంటి మార్పులు తీసుకొచ్చిందో తెలుసుకోలేక పోతున్నారు. మనకి ఈ 2020 మనకి ఎన్నో విషయాలను నేర్పింది. మన ఆరోగ్యం ఎంత ఇంపార్టెంటో తెలిపింది. మనకు ఇమ్యూనిటీ ఎంత అవసరమో తెలిసేలా చేసింది, దీనికి సంబంధించి ఎలాంటి ఫుడ్ తీసుకోవాలో అలాగే ఎంత శుభ్రాంగా ఉండాలో చెప్పింది.
చదువుకొని వారికీ కూడా వైరస్, మ్యూటేషన్, శానిటైజర్, క్వారంటైన్, యాంటీ బాడీస్, ప్లాస్మా, స్ట్రెయిన్ ఇలా ఎన్నో విషయాలు తెలియజేసింది. కరోనా వల్ల 8 నెలలు ఇంట్లో ఉండడంతో మెంటల్ హెల్త్ చాలా అవసరం అని తెలుసుకున్నాం, అలాగే ఎంతో సహనం కూడా వచ్చింది.
అన్ని నెలలు డబ్బు ఉన్నా, లేకపోయినా.. ఎలా వెళ్లదీయాలో , అంతేకాకుండా నిజమైన బంధువులు, మిత్రులు ఎవరో బయటపడింది. మన లైఫ్ లో డబ్బు దాచుకోవడం ఎంత అవసరమో నేర్పింది. వర్క్ ఫ్రమ్ హోమ్ నేర్చుకున్నాం. ఆడవాళ్లు అవసరమైనవి మాత్రమే కొనడం నేర్చుకున్నారు.
మనం అనారోగ్యం పాలైతే ఏ దేవుడూ కాపాడలేడని అర్థమైంది. ఎవరైనా చిన్న సాయం చేస్తే దాని వాల్యూ మనకు తెలిసింది. అంటూ పూరీ నేటి సమాజానికి చెప్పుకుంటూ వచ్చారు.