Today Telugu News Updates

అద్భుతంగా కొత్త పార్లమెంట్, ముహూర్తం ఖరారు…

ముహూర్తం ఖరార్ 10 న పార్లమెంట్ కొత్త భవనానికి ప్రధాని మోడీ శంకుస్థాపన…. పార్లమెంట్ కొత్త భవనం శంకుస్థాపనకు ముహుర్తం ఖరా రైంది . నిర్మాణం నిమిత్తం ఈ నెల 10 వ తేదీన ప్రధాని నరేంద్ర మోడీ శంకుస్థాపన చేయనున్నట్లు లోక్ సభ స్పీకర్ ఓమ్ బిర్లా ప్రకటించారు . రూ . 971 కోట్ల అంచనా వ్యయంతో 64,500 చదరపు మీటర్ల ప్రాంతంలో కొత్త పార్లమెంట్ భవనాన్ని నిర్మించనున్నట్లు బిర్లా చెప్పారు . ప్రస్తుతం ఉన్న భవనం నిర్మించి వందేళ్లు పూర్తయిందని , ఇది మన దేశ పౌరులకు ఎంతో గర్వకారణన్నారు . కొత్తగా నిర్మించబోయే భవనాన్ని ‘ ఆత్మనిర్మర్’లో భాగంగా మన దేశ పౌరులే నిర్మిస్తారని బిర్లా వ్యాఖ్యానించారు . ఈ మేరకు కొత్త భవన నిర్మాణ వివరాలను శనివారం బిర్లా వెల్లడించారు .

కొత్తగా నిర్మించే భవనం దేశ సాంస్కృతిక వైవిధ్యం ఉట్టిపడేలా ఉంటుందని , 75 ఏళ్ల స్వతంత్ర భారతంలో పార్లమెంట్ సమావేశాలు కొత్త భవనంలో నిర్వ హించనున్నట్లు తాను ఆశిస్తున్నానన్నారు . కొత్త భవనం భూకంపాలను తట్టుకునేలా నిర్మాణం అవుతుందని , నిర్మాణ కార్యక్రమంలో ప్రత్యక్షంగా 2 వేలమంది , పరోక్షంగా 9 వేలమంది భాగస్వామ్యం కానున్నారన్నారు . ఈ భవనంలో ఒకేసారి దాదాపు 1,224 మంది కూర్చునే అవకాశం ఉంటుందన్నారు . అదే విధంగా ఉభయ సభల్లోని సభ్యుల కోసం కొత్త కార్యాలయ ఆవరణను ప్రస్తుతం ఉన్న శరంశక్తి భవనం స్థానంలో నిర్మిం చనున్నట్లు బిర్లా చెప్పారు . కాగా , అన్ని రాజకీయ పార్టీలకు ఆహ్వానాలను పంపిస్తామన్నారు . కొంత మంది భౌతికంగా హాజరుకానుండగా , మరి కొంత మంది వర్చువల్ గా పాల్గొంటారని ఆయన అన్నారు . కొవిడ్ మార్గ దర్శకాలకు అనుగుణంగా శంకుస్థాపన కార్యక్రమం ఉంటుందని చెప్పారు . నిబంధనల ప్రకారం పార్లమెంట్ భవనానికి బాధ్యులుగా దిగువ సభకు చెందిన స్పీకరే ఉంటారు .

అందులో భాగంగా శనివారం లోక్ సభ స్పీకర్ అయిన బిర్లా శంకుస్థాపన కార్యక్రమానికి సంబంధించి అధికారి కంగా ప్రధాని నరేంద్రమోడీని ఆహ్వానించారు . ఇదిలా ఉండగా , ఈ నెల లోనే కొత్త పార్లమెంటు భవన నిర్మాణం పనులు మొదలవుతాయి . లోక్ సభ ఛాంబర్ లో ప్రస్తుతం 543 సభ్యులకు అవసరమైన సీటింగ్ కెపాసిటీ ఉండగా , కొత్త భవంతిలో సీట్ల సామర్థ్యం 888 వరకూ ఉంటుంది . రాజ్య సభ ఛాంబర్ లోనూ 245 మంది సభ్యులకు ప్రతిగా 384 సీట్లు ఏర్పాటు చేస్తారు . సంయుక్త సమావేశాలకు గాను లోకసభ ఛాంబర్ సామర్థ్యం 1,272 సీట్ల వరకూ ఉంటుంది . రెండేళ్లలోపే నూతన పార్లమెంటు భవన నిర్మాణం పూర్తవుతుందని , 75 వ భారత స్వాంతత్ర్య దినోత్సవం నాటికి పార్లమెంటు భవనం ముస్తాబవుతుందని కొత్త కార్యాలయం బాధ్యతలు చేపట్టిన సెక్రటరీ జనరల్ ఉత్పల్ కుమార్ సింగ్ తెలిపారు .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button