Today Telugu News Updates
అతి త్వరలో కరోనా ని అంతం చేయడానికి 3 వాక్సిన్ లు:- మోడీ

ప్రధాని నరేంద్ర మోడీ ఈ రోజు ఎర్ర కోట పై జాతీయ జెండా ను ఎగురవేసి దేశ ప్రజలందరికి శుభాకాంక్షలు తెలిపారు.
మోడీ మాట్లాడుతు ఈ రోజున మనం కరోనా మహమ్మారి తో పోరాడుతున్నాము , కరోనాని అంతం చేయడానికి 3 వాక్సిన్ లు తయారవుతున్నాయి , ఇవి అతి త్వరలో మార్కెట్ లోకి తీసుకు రావడానికి మన శాస్త్రవేత్తలు ప్రయత్నిస్తున్నారు .
అలాగే కరోనా మహమ్మారిని తరిమికొట్టడానికి సేవలందిస్తున్న వీరులను గుర్తు చేసుకుంటూ …. మనం ఈ రోజున ఆత్మ నిర్బర్ వల్లే పి పి ఈ కిట్లు,ఎన్ 95 మాస్కులు దేశం లో తాయారు చేస్తున్నామని ,మోడీ ఈ సందర్బంగా తెలియజెసారు .
ఇపుడు వోకల్ ఫర్ లోకల్ అనేది ప్రతి ఒక్కరి నినాదంగా మారాలని మోడీ అన్నారు. దేశీయ ఉత్పత్తులను ప్రోత్సహించాలంటే ఈ నినాదమొక్కటే మార్గమని అన్నారు. ఇదే భారతీయుల బలం అని పేర్కొన్నారు.