అగ్రహీరో పై కామెంట్ చేసినందుకు విజయ రంగరాజు… కన్నీటితో క్షమాపణ…

కన్నడ సూపర్ స్టార్ విష్ణువర్ధన్ పై నటుడు విజయ రంగ రాజు ఓ ఇంటర్వ్యూలో సంచలన వ్యాఖ్యలు చేశాడు… తను విష్ణువర్ధన్ గళ్ళ పట్టుకొని కొట్టానని… విష్ణువర్ధన్ మంచి వారు కాదని అనుచిత వ్యాఖ్యలు చేశారు… దీని పై కన్నడ ఫిలిమ్ ఇండస్ట్రీ నటులు సుదీప్,కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ విజయ రంగ రాజు పై ఆగ్రహం వ్యక్తం చేశారు.. కన్నడ సూపర్ స్టార్ పై అలా ఆరోపణలు చేయడం సరికాదన్నారు… అలాగే విష్ణువర్ధన్ అభిమానులు ట్విట్టర్ లో ” రెస్పెక్ట్ ఆర్ట్ అండ్ రెస్పెక్ట్ ఆర్టిస్ట్” అని ట్యాగ్ ను ట్రెండ్ చేస్తూ విజయ రంగరాజు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు…

ఈ విషయంపై టాలీవుడ్ నటులు కూడా కన్నెర్ర చేయడంతో…ఈ రోజు విజయ రంగ రాజు క్షమాపణలు కోరారు… తను నిందలు వేసినందుకే… కరోనా వైరస్ వచ్చిందన్నారు.. విష్ణువర్ధన్ ను నేను కొట్టలేదని.. ఏదో కోపంలో అలా మాట్లాడనన్నారు… కన్నడ అగ్ర నటులు,విష్ణువర్ధన్ అభిమానులు పెద్ద మనసుతో తనను మన్నించాలని వేడుకున్నారు…