అందాల అనసూయా….
అనసూయ అనగానే అందం గుర్తొస్తుంది, తను చేసినవన్నీ క్రేజీ సినిమాలే, సోగ్గాడే చిన్ని నాయన, క్షణం, రంగస్థలం వరకు చూసుకుంటే తను చేసిన ప్రాజెక్ట్స్ ఎలాంటివో తన టేస్ట్ ఏంటో తెలిసిపోతుంది , తను ఎంపిక చేసుకున్న సినిమాలు అఖండ విజయాలు గా నిలిచాయి, అలాగే ఇప్పుడు చేయబోయే సినిమాలు కూడా క్రేజీ ప్రాజెక్ట్ ఉంటాయని చెప్పకనే చెబుతుంది.

ఆ కోవలో మోహన్ లాల్ తో ఒక సినిమాకి సైన్ చేసింది, అలాగే తమిళ్ లో విజయ్ సేతుపతి ఒక సినిమాలో నటించనుంది, ఇక వీటితో పాటు స్టేజ్ ప్రోగ్రామ్స్ లో సుమకు గట్టిపోటీని ఇస్తూ ముందుకు సాగుతుంది, తన అందంతో ఇంస్టాగ్రామ్ లో రకరకాలుగా పోస్ట్లు పెడుతూ అందరిని ఆకట్టుకుంటుంది ఏ హీరోయిన్ కి లేని క్రేజీ తన అందం మరియు అభినయం తో పేరు తెచ్చుకుంది.

ఇక యూత్ లో తనకున్న క్రేజ్ ని చెప్పనవసరం లేదు అలాగే ఏ హీరోయిన్ కి తీసిపోని రీతిలో తను దూసుకుపోతుంది, అలాగే యూత్ కి ఆరాధ్య దేవత గా ఉంది ఇటీవల తను ఒక ఇంటర్వ్యూ లో పాల్గొని , అందులో యాంకర్ స్వాతి అను తో చేసిన ఇంటర్వ్యూ ప్రత్యేకమని చెప్పవచ్చు గంటసేపు సాగిన ఈ ఇంటర్వ్యూ లో అనేక విషయాలు చెప్పుకొచ్చింది తను ఊరికెనే పైకి రాలేదని ఎన్నో కష్టాలు పడి ఈ స్టేజ్ లో ఉన్నానని తెలిపింది, అలాగే తను ఒక రోల్ మోడల్ గా ఉందని స్వాతి చెప్పగా తన మాటకి అంగీకరించినట్టు చెప్పింది.


