సులువైన యోగా ఆయుష్షు పెంచుతుందట
ప్రకృతి సిద్ధమైన పౌష్టికాహారము, యోగసాధనకు తోడైతే శారీరక మార్పులను వాయిదా వేయవచ్చు. తొలుత మన శరీర నిర్మాణమును, దానియొక్క ధర్మములను తెల్సుకోవాలి. తదుపరి యుక్తవయస్సులో ఉన్నప్పుడు ఏమి చేయగల్గుతాము, వయస్సు మీరిన తర్వాత ఏమి చేయగల్గుతాం అనే విషయాలను బేరీజు వేసుకోవాలి. ప్రస్తుత పరిస్థితుల్లో మన దేహము, మనస్సు ఏ మేరకు పనిచేస్తున్నాయో అర్థం చేసుకోవాలి. ఒక క్రమశిక్షణ వల్ల సామర్థ్యాన్ని పెంచుకోగలగాలి. జీవితం ఎడల సకారాత్మక దృక్పథం ఏర్పరచుకోవాలి.
మారుతున్న సమాజాన్ని అసహ్యించుకోకూడదు. తరాల మధ్య అంతరాలను అంగీకరించాల్సి ఉంటుంది. కాదు, అంటే మీ నిబద్ధత శీలము, ప్రవర్తన, క్రమశిక్షణల చేత ప్రస్తుత సమాజానికి ఒక ‘ఆదర్శ వ్యక్తి’గా నిలవండి. సమాజంలో భాగంగా ఉంటూనే సమాజాన్ని సంస్కరించండి. వయస్సు భారమవుతున్నదనే ఆలోచనను తుడిచివేయండి.
స్వర్ణమయ జీ….వి….త…. మును అనుభవించండి. ఏదీ అసాధ్యం కాదు.
అనారోగ్యంతో ఎన్నేళ్ళు బతికినాకూడా వ్యర్థమే. ప్రామాణిక ఆరోగ్య వత్సరాలు జీవించండి. ఈ గ్రంథంలో అనుభవైక వేద్యమైన ఎన్నో విషయాలను ప్రస్తుతీకరిస్తున్నాను. వీటిలో మీకు సరిపడిన వాటిని గ్రహించి ఆచరించండి.