technology information

write your mails fast with gmail smart compose feature

write your mails fast with gmail smart compose feature

gmail new smart compose feature

నేటి టెక్నాలజీ యుగంలో మనం ఎక్కువగా ఇంటర్నెట్ పైన డిపెండ్ అవుతుంటాము. మనం ఎక్కువగా ఫైల్స్ సెండ్ చేయడానికి, గ్రీటింగ్స్ పంపడానికి, సందేశాలను సెండ్ చేయడానికి ఎక్కువగా ఈ-మెయిల్స్ ని యూస్ చేస్తుంటాము. ఈ ఈ-మెయిల్స్ ని రాసేటపుడు మనము టైపింగ్ చేసే క్రమంలో కొన్ని పదాలలో తప్పులు దొర్లే అవకాశo ఉంటుంది. అందువల్ల మనం టైపు చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా చూసి ఈ-మెయిల్స్ రాస్తుంటాము. ఎక్కువ సంఖ్యలో ఈ-మెయిల్స్ ని వ్రాయాల్సి వచ్చినపుడు దాని కోసం ఎక్కువ టైం ని స్పెండ్ చేయాల్సి ఉంటుంది. మరి మీ సమయం వృధా కాకుండా ఈ -మెయిల్స్ వేగంగా టైప్ చేయాలనుకుంటున్నారా? అయితే జిమెయిల్ యొక్క ఈ సరికొత్త ఫీచర్ మీ కోసమే. అదే ఆర్టిఫిసియల్ ఇంటిలిజెన్స్(AI)ఆధారిత నడిచే స్మార్ట్ కంపోజ్ ఫీచర్.

అసలు ఏంటి ఈ స్మార్ట్ కంపోజ్ ఫీచర్? దీని ఎలా యూస్ చేయాలి? దీని వలన ఈ-మెయిల్స్ ఫాస్ట్ గా ఎలా రాయొచ్చు అనే విషయాలను ఇప్పుడు చూద్దాం.

Gmail స్మార్ట్ కంపోజ్ ఫీచర్ అంటే ఏమిటి:

జిమెయిల్  స్మార్ట్ కంపోజ్ ఫీచర్ ఇమెయిల్ కంటెంట్ ని మీరు టైపు చేసేటపుడు ఆటో కంప్లీట్ అయ్యేలా చేస్తుంది. అంటే జిమెయిల్ యొక్క ఆర్టిఫిసియల్ ఇంటిలిజెన్స్ (AI) సహాయంతో ఈ స్మార్ట్ కంపోజ్ ఫీచర్ మనం రాసే సబ్జెక్టుని  అర్థం చేసుకుని, టైప్ చెయ్యాలనుకుంటున్న మాటలను రికమెండ్ చేస్తుంది. వాటిని మనకు కావాల్సిన ఫ్రేజేస్ (పదాలను) సెలెక్ట్ చేసుకుంటే చాలు. దీని వల్ల ముందు కంటే ఫాస్ట్ గా ఇమెయిల్ కంపోజ్ చేయోచ్చు.

Gmail లో స్మార్ట్ కంపోజ్ ఎలా ఎనేబుల్ చేసుకోవాలి:

1: మీ జిమెయిల్ కి వెళ్లి, మీ గూగుల్ అకౌంట్ లోకి లాగ్ ఇన్ అవ్వండి. కుడి వైపు పైన ఉన్న గేర్ ఐకాన్ మీద క్లిక్ చేసి, సెట్టింగ్స్ కి వెళ్ళండి.

2: జనరల్ ట్యాబ్ లో, ఎక్స్పెరిమెంటల్ యాక్సెస్ అని పిలువబడే ఒక ఆప్షన్ ని మీరు చూస్తారు. ఆ బాక్స్ లో  చివరివరకు స్క్రోల్ చేసి, సేవ్ చేంజెస్ అనే ఆప్షన్ ని క్లిక్ చేయండి.

  1. జనరల్ సెట్టింగ్స్ కి తిరిగి వెళ్ళండి.
  2. ఇప్పుడు జనరల్ ట్యాబ్ కింద స్మార్ట్ కంపోజ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. రైటింగ్ సజిషన్స్ ని సెలెక్ట్ చేసి హిట్ “సేవ్ చేంజెస్” పైన హిట్ చేయాలి. ఇప్పుడు మీరు జిమెయిల్ లో స్మార్ట్ కంపోజ్ ఫీచర్ ని సక్సెస్ ఫుల్ గా ఎనేబుల్ చేసి మీ మెయిల్ బాక్స్ కి వెళ్ళండి.

ఒక కొత్త మెయిల్ రాయడానికి మీ స్క్రీన్ యొక్క ఎడమ వైపున కంపోజ్ బటన్ పై క్లిక్ చేయండి. మీ రేసిపిటేంట్ ఈ-మెయిల్ అడ్రస్ ని ఎంటర్ చేసి సబ్జెక్టుని ఎంటర్ చేయండి. ఇప్పుడు మీరు బాడీపై కర్సర్ ని మూవ్ చేయగానే ఫస్ట్ లైన్ లో మీకు సజిషన్స్ కనిపిస్తాయి.

స్క్రీన్ షాట్ లో ఉన్నట్టు ఫస్ట్ స్మార్ట్ కంపోజ్ మీ రేసిపిటేంట్ కి మొదట గ్రీటింగ్స్ రాయడం మొదలుపెట్టాలని సూచిస్తుంది, స్మార్ట్ కంపోజ్ ఫీచర్ యొక్క ఈ సజిషన్ ని, సెలెక్ట్ చేయడానికి మీరు ‘టాబ్’ బటన్ ని ప్రెస్ చేస్తే చాలు.ఈ జిమెయిల్ యొక్క ఆర్టిఫిసియల్ ఇంటిలిజెన్స్ బేస్డ్ స్మార్ట్ కంపోజ్ ఫీచర్ ద్వారా మీ రైటింగ్ స్కిల్స్ ని నేర్చుకొని మీరు రాయాలనుకునే దానికి అనుగుణంగా టైపు చేయాలనుకొనే ఫ్రేసేస్ ని సజెస్ట్ చేస్తుంది.

ప్రస్తుతం, కొత్త Gmail లోనే ఈ స్మార్ట్ కంపోజ్ ఫీచర్ మాత్రమే ఎక్స్పెరిమెంటల్ బేసిస్ పై అందుబాటులో ఉంది. ట్రై ఇట్ ఒన్స్ అండ్ ఎక్స్పీరియన్స్ ఇట్.

Tags

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button