health tips in telugutechnology information

with using app recognize the skin cancer

with using app recognize the skin cancer

with using app recognize the skin cancer

పంచేంద్రియాలలో చర్మం ఒకటి. సాధారణంగా మనం స్కిన్ గురి౦చి పెద్దగా జాగ్రత్త తీసుకోము. మన శరీరంలోని ముఖ్యమయిన అవయవాలలో చర్మం కూడా ఒకటి. ఈ చర్మం మీద మనకు మచ్చలు అనేవి కనపడుతుంటాయి. కొన్ని మచ్చలు మనకు పుట్టినప్పుడే ఉంటాయి. కొన్ని మచ్చలు మనకు మధ్యలో కూడా ఏర్పడతాయి. సాధారణంగా వీటిని గురించి మనం పెద్దగా పట్టించుకోము.

కొన్ని మచ్చల వల్ల మన ప్రాణాలు పోయే అవకాశo కూడా ఉంది. ఎందుకు అంటారా? మచ్చలు సాధారణంగా పరిమాణంలో చాలా చిన్నవిగా నలుపు రంగులో ఉంటాయి. వీటి వలన ఎలాంటి ప్రమాదం లేదు. కొన్ని మచ్చలు తెలుపు రంగులో ఉ౦డి శరీరమంతా వ్యాపిస్తాయి. దీనిని బొల్లి అంటాము. దీని వలన ప్రాణ హాని లేదు. కాని కొన్ని మచ్చలు ఎరుపు రంగులో మొదట్లో పరిమాణంలో చిన్నవిగా ఉంది పోను పోను పరిమాణం లో పెద్దవిగా ఉంది కాన్సర్ వ్యాధికి దారి తీస్తుంది. దీనినే స్కిన్ కాన్సర్ లేదా మెలనోమ అంటారు.

ఇది సాధారణంగా సూర్యకాంతికి చర్మం ఎక్కువ లోనుకావడం వలన కలుగుతుంది. సాధారణంగా ఈ రోజుల్లో మనం ఏ చిన్నఆరోగ్య సమస్యయిన  గూగుల్ లో సెర్చ్ చేయడం అలవాటుగా మారింది, దీని వలన మన సందేహాలు కొంత వరకు తీరిన, కొన్ని కొత్త సందేహాలు తలెత్తుతాయి. నేటి ఆధునిక కాలంలో ఎక్కడ చూసిన smart phones కనపడుతున్నాయి. అవి లేకుండా మన జీవితాన్ని ఊహించలేము. వీటి వలన నష్టాలు ఎన్ని ఉన్న కొన్ని ఉపయోగాలు కుడా ఉన్నాయి. వీటిలో రోజుకొక కొత్త ఆప్ ని install చేస్తున్నారు. అలాంటి ఆప్ లో skin vision app ఒకటి. ఈ రోజుల్లో ఎవరి నోట విన్న, ఎక్కడ చూసిన selfie హవా నడుస్తుంది. selfie కి skin vision ఆప్ కి, స్కిన్ కాన్సర్ కి సంభంధం ఏమిటి అనుకుంటున్నారా?  సంభంధం ఉందండి.

కాకపోతే మన స్మార్ట్ ఫోన్ లో స్కిన్ విజన్ ఆప్ ఉండాలి. స్కిన్ విజన్ స్మార్ట్ ఫోన్ తో సెల్ఫీ తీసిన మచ్చల ఫొటోస్ ని అనాలసిస్ చేసి ఆ మచ్చలు సాధారణమయినవా, లేదా, కాన్సర్ కి దారి తీసేవా అని మనకు తెలుపుతుంది. ఒక వేళ ఆ మచ్చలు కాన్సర్ కలిగించేవి అయితే ఆ కాన్సర్ మన శరీరం లో ఏ స్టేజ్ లో ఉంది అనే దానిని అంచనా వేస్తుంది. దీని వలన మనం వెంటనే వైద్యుడిని సంప్రదించవచ్చు. ప్రాణ హాని జరగకుండా చూడొచ్చు. ఈ ఆప్ ద్వారా మనo స్కిన్ కాన్సర్ ని ముందుగానే గుర్తించి తగిన సమయంలో ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. అలా అని ఇది డాక్టర్ కి ప్రత్యామ్నాయo మాత్రం కాదు. కేవలం స్కిన్ కాన్సర్ నుంచి మనం తీసుకునే జాగ్రత్త మాత్రమే. ఈ ఆప్ ఇండియాలో కూడా రాబోతుంది. ఆప్ డౌన్లోడ్ చేసుకోండి, సెల్ఫీ తీయండి, స్కిన్ కాన్సర్ ని గుర్తించండి.

Tags

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button