చరణ్ సినిమా ఆడియో సాంగ్ విడుదల
రామ్ చరణ్ కొత్త సినిమా పాట సోమవారం విడుదల.
రామ్ చరణ్ హీరోగా బోయపాటి దర్శకత్వం లో రాబోతున్న యాక్షన్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ వినయ విధేయ రామ, దేవీశ్రీప్రసాద్ సంగీతం సమకూర్చగా dvv దానయ్య ఈ సినిమాని నిర్మిస్తున్నారు. మొన్నీమధ్య టీజర్ విడుదల కాగా ఆడియన్స్ నుండి మంచి పాజిటివ్ టాక్ పొందింది.
అయితే మరో అడుగు ముందుకేసి సోమవారం సాయంత్రం రోజున తందానే అన్న మాటలతో మొదలయ్యే ఒక సాంగ్ విడుదల చేయనున్నట్టు నిర్మాత ట్వీట్ చేశారు. కియా అద్వానీ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రం సంక్రాంతికి మన ముందుకు రానుంది.