మాహవీర్ కర్ణ పాత్రలో విక్రం

భారీ బడ్జెట్ తో సియాన్ విక్రమ్ సరికొత్త మూవీ.

తమిళ పరిశ్రమలో విలక్షణ పాత్రలతో సెట్ అయిన తెలుగు హీరో విక్రమ్. అపరిచితుడు, మల్లన్న, ఐ వంటి విభిన్న పాత్రలతో దేశవ్యాప్తంగా క్రేజ్ సంపాదించిన విక్రం కోసం మరొక కొత్త సినిమా రెడీ అయింది. అయితే ఈ మూవీ నేరుగా హిందీ లో నిర్మితం అవుతుంది.

సినిమా పేరు మహావీర్ కర్ణ. చిత్రాన్ని యునైటెడ్ ఫిల్మ్ కింగ్ డం సంస్థ నిర్మిస్తుంది. సుమారు 300 కోట్ల రూపాయల బడ్జెట్.ఆర్ ఎస్  విమల్ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తుండగా హాలీవుడ్ సిరీస్ గేం ఆఫ్ థ్రోన్స్ కి పనిచేసిన టెక్నికల్ టీం విజువల్ ఎఫెక్ట్స్ కోసం పని చేస్తున్నట్టు తెలిసింది. దాదాపు చిత్ర వివరాలు అన్ని గోప్యమే. ఒక గంట చుట్టూ సినిమా కథ అంతా తిరుగుతుంది.ట్రివేండ్రంలో అనంత పద్మనాభ ఆలయం లో ఆ గంట కు పూజ చేసి రామోజీ ఫిల్మ్ సిటీ కి తీసుకువచ్చినట్టు సమాచారం.

రామోజీ ఫిల్మ్ సిటీలో కూడా ఈ మైథాలజీ మూవీ కోసం ఒక భారీ రథం సిద్ధం చేస్తున్నట్టు, జనవరిలో షూట్ మొదలై వచ్చే ఏడాది జనవరిలో రిలీజ్ కి సిద్ధం చేయనున్నట్లు వినికిడి.

 

Please follow and like us:
0

You may also like...

Leave a Reply

Your email address will not be published.

Enjoy this blog? Please spread the word :)