ప్రతి తెలుగువాడు గర్వించదగ్గ తెలుగు సినిమా సాధించిన గిన్నిస్ బుక్ రికార్డ్స్

టాలీవుడ్ గా పిలవబడుతున్న తెలుగు సినీ పరిశ్రమ భారతీయ చలన చిత్రoలో ఒక ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకుంది. ఎంతో మంది గొప్ప దర్శకులు, నిర్మాతలు, నటీనటులకు పెట్టింది పీరు మన తెలుగు సినీపరిశ్రమ. ప్రతి తెలుగు వాడు గర్వంగా చెప్పుకునే ఎందరో మహానుభావులు జాతీయ,అంతార్జాతీయ స్థాయిలో తెలుగుజాతి కీర్తి పతాకాన్ని ఎగురవేశారు. తెలుగు సినీ పరిశ్రమలో కొందరు సినీ దిగ్గజాలు సాధించిన విజయాలకు గాను వారి పేర్లు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో చేర్చబడ్డాయి. మరి అందులో చోటు సంపాదించుకున్న వారెవరో ఇప్పుడు తెలుసుకుందాం.

  1. పి.సుశీల (గాయని) – అత్యధిక సంఖ్యలో పాటలు పాడినందుకుగాను

“గాన కోకిల” గా పిలుచుకునే పి.సుశీల 1952 లో ప్లేబ్యాక్ గాయనిగా తొలిసారిగా ఆరు భారతీయ భాషలలో 17,695 సోలో, డ్యూయెట్స్, కోరస్ బ్యాక్ సాంగ్స్ పాడినందుకు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో ఆమెకు చోటు లభించింది. సుశీల 1,336 డ్యూయెట్ పాటలను కేవలం లెజెండరీ గాయకుడు SP బాలసుబ్రహ్మణ్యంతో కలిసి పాడడం కూడా ఒక రికార్డు.

  1. బ్రహ్మానందం – ఎక్కువ సీన్స్ లో నటించినందుకు

టాలీవుడ్ లో కామెడీకి కేరాఫ్ అడ్రస్ అంటే బ్రహ్మానందం.  బ్రహ్మానందo అంటే కామెడీ , కామెడీ అంటే బ్రహ్మానందo అన్నంతగా తెలుగు ప్రేక్షకుల హృదయాలలో స్థానం సంపాదించుకున్నాడు. అతని అసంఖ్యాకమైన ప్రదర్శనలకు గాను ‘పద్మశ్రీ’ అవార్డు మరియు  గిన్నిస్ బుక్ లోను స్థానం సంపాదించుకున్నారు.

  1. డాక్టర్ డి రామానాయుడు – ఎక్కువ సినిమాలు నిర్మించిన నిర్మాతగా

డాక్టర్ డి రామానాయుడు సురేష్ ప్రొడక్షన్స్ అనే సంస్థను స్థాపించారు. ఇది తెలంగాణలో ఉన్న భారతదేశంలో అతిపెద్ద ప్రొడక్షన్ హౌసెస్ లో ఒకటి. రామానాయుడు 13 భారతీయ భాషలలో 150 పైగా చిత్రాలను నిర్మించాడు. ఇందుకు గాను అతను గిన్నిస్ బుక్స్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో స్థానం సంపాదించుకున్నారు.

  1. డాక్టర్ గజల్ శ్రీనివాస్ – 100 భాషలలో 100 పాటలు పాడినందుకు

ఘజల్ శ్రీనివాస్, గజల్ గురువు ఆంధ్రప్రదేశ్ లోని పశ్చిమ గోదావరి జిల్లాలోని పాలకోల్లు నుండి వచ్చారు. అతను 100 భాషలలో 100 పాటలు తన సొంత శైలిలో ఆలపించారు. ఇందుకుగాను గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో అతని పేరు నమోదయ్యింది. అతను కొన్ని తెలుగు సినిమాలకు వాయిస్ కూడా అందించాడు.

  1. రామోజీ ఫిల్మ్ సిటీ –ప్రపంచంలోని అతి పెద్ద ఫిల్మ్ స్టూడియో

ఈనాడు గ్రూప్స్ అధినేత రామోజీరావు నిర్మించిన రామోజీ ఫిలిం సిటీ హైదరాబాద్ నగర శివార్లలో ఉన్నది. ఇది కేవలం ఒక ఫిలిం సిటీనే కాదు, అద్భుతమైన ఆశ్చర్యాలతో కూడిన మాయాబజార్ లాంటిది. కేవలం తెలుగు సినిమాలే కాదు, బాలీవుడ్ సినిమాల షూటింగ్స్ కూడా ఇక్కడ జరుగుతుoటాయి. ప్రపంచంలోనే అతి పెద్ద ఫిలిం సిటీ గా గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో స్థానం సంపాదించుకుంది.

  1. S.P. బాలసుబ్రహ్మణ్యం – అత్యధిక సినిమా పాటలు పాడిన వ్యక్తిగా

శ్రీపతీ పండితారాద్యుల బాలసుబ్రహ్మణ్యం లేదా అతని ఫాన్స్ ప్రేమగా పిలుచుకునే బాలుకు 1966 లో ప్లేబ్యాక్ సింగర్ గా తొలిసారిగా 1966 లో ‘శ్రీ శ్రీ శ్రీ మర్యాద రామన్న’ అనే తెలుగు సినిమాలో పాడారు. ఎన్నో సంవత్సరాలుగా అతను వివిధ భాషలలో దాదాపు 36,000 పాటలను పాడారు, ఇందుకుగాను బాలు గారికి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో స్థానం లభించింది.  సింగర్ గానే కాకుండా, నటుడిగా, డబ్బింగ్ ఆర్టిస్ట్ గా,నిర్మాతగా, సంగీత దర్శకుడిగా కూడా పేరు తెచ్చుకున్నాడు.

  1. విజయ నిర్మల – అత్యధిక చిత్రాలను డైరెక్ట్ చేసిన లేడీ డైరెక్టర్ గా

సూపర్ స్టర్ కృష్ణ గారి భార్య అయిన విజయనిర్మల గారు అందంగా ఉండడమే కాకుండా తన అభినయంతో కూడా ఆకట్టుకున్నారు. ఆమె అల్లూరి సీతారామరాజు సినిమాలో వస్తాడు నా రాజు అంటూ వచ్చే పాటలో ఆమె అభినయం ఎప్పటికి మర్చిపోలేనిది.  తెలుగు, తమిళ, కన్నడ మరియు మలయాళం భాషలలో 42 సినిమాలకు దర్శకత్వం వహించారు. అత్యధిక సినిమాలకు డైరెక్షన్ చేసిన లేడీ డైరెక్టర్ గా గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో చోటు సంపాదించుకున్నారు.

Please follow and like us:
0

You may also like...

Leave a Reply

Your email address will not be published.

Enjoy this blog? Please spread the word :)