హరికృష్ణ మృతికి సంతాపం తెలిపిన టాలీవుడ్ ప్రముఖులు

తెలుగుదేశం పార్టీ సీనియ‌ర్ నాయ‌కుడు, టాలీవుడ్ సీనియర్ న‌టుడు నంద‌మూరి హ‌రికృష్ణ ఈ రోజు ఉదయం ప్రయాణిస్తున్న కారు నల్గొండ జిల్లాలో యాక్సిడెంట్ కి గురైంది. ఈ ప్రమాదంలో ఆయన మృతి చెందారు. ఆయన మ‌ర‌ణం రెండు తెలుగు రాష్ట్రాల ప్ర‌జ‌ల‌ను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. నందమూరి హరికృష్ణ చేసినవి కొన్ని సినిమాలే అయినా కూడా తెలుగు సినిమా పరిశ్రమతో ఆయన చాలా అనుబంధంను కలిగి ఉన్నారు. అందుకే హ‌రికృష్ణ మృతి సినీ పరిశ్ర‌మ‌లో తీవ్ర విషాదం నింపింది. అందుకే ఆయన మరణంతో తెలుగు సినిమా పరిశ్రమకు చెందిన పలువురు స్టార్స్ తమ సంతాపంను సోష‌ల్ మీడియా ద్వారా విచారం వ్య‌క్తం చేస్తున్నారు. హ‌రికృష్ణ త‌న‌యులు ఎన్టీయార్‌, క‌ల్యాణ్ రామ్‌ల‌కు సానుభూతి తెలియ‌జేస్త‌న్నారు.

అక్కినేని నాగార్జున:

అక్కినేని నాగార్జున హరికృష్ణగారితో తన చివరి సంభాషణ గురించి ట్విటర్‌ లో తెలియజేస్తూ ‘కొన్నివారాల క్రితమే హరికృష్ణగారు నాతో నిన్ను చూసి చాలా రోజులు అయింది తమ్ముడు. నిన్ను కలవాలి తమ్ముడు అని అన్నారని, “మిస్‌ యూ అన్న” అంటూ నాగార్జున తన సంతాపాన్ని తెలిపారు. ఈరోజు జరగాల్సిన తన పుట్టిన రోజు వేడుకల్ని రద్దు చేసుకుంటున్నట్టుగా ప్రకటించారు. ఇటీవలే నాగార్జున అభిమాని రవీందర్ రెడ్డి మృతి నుంచి బయటపడక ముందే ఆప్యాయ మిత్రుడు, సోదరసమానుడు మరణించడంతో నాగార్జున మరింత తీవ్ర దిగ్బ్రాంతికి గురయ్యాడు.

మహేష్ బాబు:

హరికృష్ణ గారి మరణం నన్ను తీవ్రంగా కలిచి వేసింది. ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నా నా బ్రదర్ ఎన్టీఆర్ కు మరియు ఆయన కుటుంబంకు మనోధైర్యం ఇవ్వాలని దేవుడిని మహేష్ కోరుకుంటున్నట్లుగా ట్వీట్ చేశాడు.
రామ్ చరణ్ :

యాక్సిడెంట్ లో హరికృష్ణ గారి మరణ వార్త విని షాక్ అయ్యాను. ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నాను ఆయన ఫ్యామిలీకి తన ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేస్తున్నట్లుగా ఫేస్ బుక్ లో పోస్ట్ చేశాడు.

మంచు మనోజ్:

ఈ విషాద సంఘటన విన్నవెంటనే షాక్‌ కు గురయ్యాను. నాకు ఇప్పుడు మాటలు రావడం లేదు. దేవుడు నిజంగా చాలా కఠినమైనవాడు. నందమూరి హరికృష్ణగారి కుటుంబసభ్యులకు, అభిమానులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను

దేవిశ్రీ ప్రసాద్ :

నందమూరి హరికృష్ణగారి గురించి ఇలాంటి దురదృష్టకరమైన వార్త వినడం నమ్మలేకపోతున్నాను. చాలా గొప్ప వ్యక్తి. నాకు, నా తండ్రికి ఆయన చాలా ఆప్తుడు. ఆ భగవంతుడు కుటుంబసభ్యులకు శక్తిని ప్రసాదించాలని కోరుకుంటున్నాను. కళ్యాణ్ రామ్, ఎన్టీఆర్ లకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా.

మోహన్ బాబు:

ఈరోజు నా సోదరుడు నందమూరి హరికృష్ణను కోల్పోయాను. ఇంతకు మించి నాకు మాటలు రావడంలేదు. ఇది తీరని లోటు.

అల్లు అర్జున్:
నేను విదేశాల్లో ఉన్నా. ఇప్పుడే ఈ చేదు వార్తను విన్నా! షాక్‌కు గురయ్యా. నందమూరి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నా. కళ్యాణ్‌రామ్, ఎన్టీఆర్‌ను సానుభూతి తెలియజేస్తున్నా. రిప్!

వరుణ్ తేజ్:
హరికృష్ణ గారి ఆకస్మిక మరణం నిజంగా షాకింగ్. ఈ లోటును తట్టుకునేంత శక్తి, సామర్థ్యాలు ఆయన కుటుంబానికి ఇవ్వాలని కోరుకుంటున్నా. వారికి నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నా.

మంచు విష్ణు:
ఇలా జరిగుండకూడదు. కళ్యాణ్‌రామ్, ఎన్టీఆర్‌ ధైర్యంగా ఉండాలని ఆ దేవుడిని ప్రార్థించండి.

ర‌కుల్‌:

చాలా బాధ‌గా ఉంది. ఆయ‌న ఎప్పుడూ చిర‌స్మ‌ర‌ణీయంగానే ఉంటారు. ఆయ‌న ఆత్మ‌కు శాంతి క‌ల‌గాలి.

స‌మంత‌:

ఆయ‌న మ‌ర‌ణ‌వార్త షాక్ క‌లిగించింది. ఈ విషాద స‌మ‌యంలో ఆయ‌న కుటుంబ స‌భ్యులు ధైర్యంగా ఉండాలి.

సుధీర్‌ బాబు:

ఈ ఉదయం నిద్రలేవగానే ఇంత ఘోరమైన విషాద వార్త వినాల్సి రావడం, నన్ను తీవ్రంగా కలచి వేస్తోంది. హరికృష్ణగారి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను. ఈ విషాదాన్ని అధిగమించడానికి తారక్‌, కళ్యాణ్‌ తో పాటు వారి కుటుంబసభ్యులందరికి ఆ భగవంతుడు శక్తిని ఇవ్వాలని ప్రార్ధిస్తున్నాను.

అల్లు శిరీష్:
నందమూరి హరికృష్ణ ఆకస్మిక మరణం గురించి తెలిసి చాలా బాధేసింది. బాలకృష్ణ గారు, తారక్, కళ్యాణ్ రామ్, మొత్తం నందమూరి కుటుంబానికి నా సానుభూతిని తెలియజేస్తున్నా. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలి.

అల్లరి నరేష్‌:

నందమూరి హరికృష్ణ గారి మరణవార్త నన్ను షాక్‌ కు గురిచేసింది. ఆయన గొప్ప మనసున్న వ్యక్తి. కుటుంబసభ్యులకు, అభిమానులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను.

మంచు లక్ష్మి:
ఈ వార్త నన్ను చాలా షాక్‌కు గురిచేసింది. ఆయన కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నా. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నా. ఆయన మాకెంతో ఆత్మీయుడు.

వైవీఎస్ చౌద‌రి:

మ‌నుసుతోపాటు శ‌రీరంలోని అణువ‌ణువు `బాధ‌`ప‌డుతోంది. ‘తీర్చేవారు` ఒక్కొక్క‌రిగా దూరం అవుతున్నారు. ఈ రోజు త‌న‌కు `న‌చ్చితే`, అచంచ‌ల‌మైన `న‌మ్మకాన్ని` పెంచుకునే నా `సీత‌య్య‌`.

సీనియ‌ర్ న‌రేష్‌:

హ‌రికృష్ణగారి మ‌ర‌ణవార్త చాలా షాక్ క‌లిగించింది. హ‌రికృష్ణ కుటుంబ స‌భ్యుల‌కు నా ప్ర‌గాఢ సానుభూతి తెలియ‌జేస్తున్నాను.

రాజ‌శేఖ‌ర్: మా మంచి, చెడు స‌మ‌యాల్లో హ‌రికృష్ణ‌గారు ఎప్పుడూ మాకు అండ‌గా నిల‌బ‌డ్డారు. ఈ వార్త‌ను న‌మ్మ‌లేపోత‌న్నా. ఆయ‌న మా కుటంబంలో ఓ భాగం. ఆయ‌న ఆత్మ‌కు శాంతి చేకూరాలి.

నాని:

వార్త వినగానే షాక్ అయ్యాను. ఆయ‌ణ్ని వ్య‌క్తిగ‌తంగా ఎప్పుడూ క‌ల‌వ‌లేదు. హరికృష్ణ వంటి వ్యక్తిని మళ్లీ చూడలేనేమో. ఆయన కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను.

కొరాటాల శివ‌:

హ‌రికృష్ణ‌గారి మ‌ర‌ణ వార్త న‌న్ను తీవ్ర విషాదంలో ముంచింది. ఆయ‌న‌తో నాకు మంచి అనుబంధం ఉంది. ఆయ‌న ఆత్మ‌కు శాంతి చేకూరాల‌ని కోరుకుంటున్నాను. ఆయ‌న కుటుంబ స‌భ్యుల‌కు నా ప్ర‌గాఢ సానుభూతి తెలియ‌జేస్తున్నాను.

కోన వెంకట్‌:

ఈ వార్త షాక్‌కు గురిచేసింది. ఆయన మృతి నందమూరి కుటుంబానికి తీరని లోటు. ఆయన మంచి వ్యక్తి, గొప్ప తండ్రి. నా బాధను వ్యక్తపరచడానికి మాటలు రావడం లేదు. ఇది విషాదకరమైన రోజు.

రామ్‌:

ఏమి చెప్పాలో అర్థం కావ‌డం లేదు. ఇది చాలా పెద్ద విషాదం. ఆయ‌న కుటుంబ స‌భ్యుల‌కు మాన‌సిక స్థైర్యం చేకూరాల‌ని కోరుకుంటున్నా.

రానా:

హ‌రికృష్ణ‌గారు చాలా త్వ‌ర‌గా వెళ్లిపోయారు. ఈ విషాద స‌మ‌యంలో ఎన్టీయార్‌, క‌ల్యాణ్‌రామ్ ధైర్యంగా ఉండాల‌ని కోరుకుంటున్నా.

సుమంత్‌:

హ‌రికృష్ణ‌గారి మ‌ర‌ణ వార్త తీవ్ర విచారం క‌లిగించింది. ఆయ‌న‌తో నాకు మంచి జ్ఞాప‌కాలు ఉన్నాయి. ఎన్టీఆర్, క‌ల్యాణ్‌రామ్‌, ఇత‌ర కుటుంబ స‌భ్యుల‌కు నా ప్రగాఢ సానుభూతి.

మారుతి:

పొద్దునే షాకింగ్ న్యూస్ – నందమూరి హరికృష్ణ గారి ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నాను. టాలీవుడ్ సినీ పరిశ్రమ ఒక ప్రముఖుడిని కోల్పోయింది అంటూ ట్వీట్ చేశాడు.

బాబి:

ఇది నిజం కాకూడ‌ద‌ని కోరుకుంటున్నా. అభిమానుల‌కు ఇది తీర‌ని లోటు. ఆయ‌న ఆత్మ‌కు శాంతి చేకూరాల‌ని కోరుకుంటున్నా.

సునీల్‌:

హ‌రికృష్ణగారి మ‌ర‌ణ‌వార్త తెలిసి చాలా బాధ‌ప‌డ్డాను. ఎన్టీయార్‌, క‌ల్యాణ్‌రామ్‌, నంద‌మూరి కుటుంబ స‌భ్యులంద‌రికీ నా ప్ర‌గాఢ సానుభూతి. హ‌రికృష్ణ‌గారి ఆత్మ‌కు శాంతి చేకూరాలి.

 

 

 

Please follow and like us:
0

You may also like...

Leave a Reply

Your email address will not be published.

Enjoy this blog? Please spread the word :)