గొప్ప రాజకీయవాది, మహోన్నత వ్యక్తి -వాజ్ పేయికి టాలీవుడ్ ప్రముఖుల నివాళి

దేశ అభివృద్ధి కోసం ఎన్నో గొప్ప సంస్కరణలు, చారిత్రక నిర్ణయాలు తీసుకున్న గొప్ప ప్రధాన మంత్రుల్లో ఒకరు అటల్ బిహారీ వాజ్ పేయి. భారత రత్న అవార్డును అందుకున్న మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి చాలా కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న సంగతి మనందరికీ తెలిసిందే. నిన్న అనగా గురువారం సాయంత్రం ఎయిమ్స్ లో చికిత్స పొందుతూ కన్ను మూశారు. అటల్ బీహారి వాజ్‌పేయి ఒక మంచి కవి కూడా. వాజ్‌పేయి ఇక లేరన్న వార్తతో ఆయన అభిమానులు, బీజేపీ కార్యకర్తలు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. ఆయన చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు. మాజీ ప్రధాని మృతికి రాజకీయ, సినీ ప్రముఖులు పలువురు ఆయన ఆత్మకు శాంతి కలుగాలని భగవంతుడిని ప్రార్థించారు. దేశం ఓ గొప్ప నాయకుడిని కోల్పోయిందన్న విచారం వ్యక్తం చేసారు. ఆయన మరణం పట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు.

నందమూరి బాలకృష్ణ గారు మా ‘బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్’ను జూన్ 22, 2000 సంవత్సరంలో ప్రారంభోత్సవం చేసిన మహానుభావుడు వాజపేయి గారు. నాన్నగారితో ఆయనకి మంచి అనుబంధం ఉండేది. ఆయన మంచి వ్యక్తి, భావుకత పుష్కలంగా ఉన్న కవి కూడా. ప్రధానిగా సేవలందిస్తూ ఎన్నో విప్లవాత్మకమైన నిర్ణయాలు తీసుకొన్న సమర్ధుడు ఆయన. అంతటి మహోన్నత రాజకీయ నాయకుడిని కోల్పోవడం బాధాకరం. వాజపేయి ఓ నిస్వార్ధమైన రాజకీయ నాయకుడు అని అన్నారు.

డా౹౹ఎం.మోహన్ బాబు వాజపేయిగారితో మూడుసార్లు వేదిక పంచుకొనే అవకాశం దొరికింది. నా మాటలను మెచ్చుకొనేవారు ఆయన. నేను, విద్యాసాగర్ రావు గారు, వాజపేయిగారు కలిసి పనిచేసాం. ఆయన ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు నేను రాజ్యసభ సభ్యుడిగా బాధ్యతలు నిర్వర్తించాను. రాజకీయాల్లో వాజపేయి లాంటి మంచి వ్యక్తిత్వం ఉన్న మనుషులు చాలా అరుదు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని శిరిడి సాయినాధుని కోరుకొంటున్నాను.
రాజకీయలకు గౌరవం తెచ్చిన వ్యక్తి వాజ్ పేయి గారు. ఆయన తీసుకున్న నిర్ణయాలు దేశంలోని ప్రజలందరి జీవితాల్లో మార్పు తెచ్చింది అంటూ రాజమౌళి ట్వీట్ చేశారు.

మన దేశాన్ని లీడ్ చేసిన గ్రేట్ లీడర్స్ లో ఒకరైన వాజ్ పేయి గారికి సెల్యూట్. గొప్ప రాజకీయవేత్త, గొప్ప జాతీయ వాది, గొప్ప విజన్ ఉన్న నాయకుడు అంటూ ఎన్టీఆర్ ట్వీట్ చేసారు.

ఈ రోజు మనం గొప్ప రచయిత, వక్తను, రాజనీతిజ్ఞుడుని కోల్పోయాం. ఆయన ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తున్నాను. అని రానా ట్వీట్ చేశారు.

నా ఫేవరెట్ పొలిటీషియన్ వాజ్ పేయి. ఆయన మన మధ్య భౌతికంగా లేకపోయినా ఆయన చేసిన  మంచి పనుల రూపంలో ప్రజల గుండెల్లో ఎప్పటికీ చిరస్థాయిగా నిలిచిపోయి ఉంటారు అని మంచు విష్ణు ట్వీట్ చేశారు.

ప్రముఖ నటి గౌతమి ఆయన దేశానికి చేసిన సేవ ఎంతో మందికి స్పూర్తి దాయకం అని ట్వీట్ చేసారు.

వాజ్ పేయి ఆత్మకు శాంతి చేకూరాలని పేర్కొంటూ అల్లరి నరేష్ ట్వీట్ చేసారు.

హీరోయిన్ ఈషా రెబ్బ ట్వీట్. ఆయన్ను గొప్ప రాజకీయ వేత్తగా పేర్కొంటూ ఓ వీడియోను పోస్టు చేశారు.

అటల్ బిహారీ వాజ్ పేయి గారి మరణం కారణంగా ఆయన ఆత్మకి శాంతి చేకూరాలని కోరుకుంటున్నాము అని సురేష్ ప్రొడక్షన్స్ సంస్థ ట్వీట్ చేసింది.

యాంకర్ మరియు నటి రష్మీ కూడా వాజ్ పేయి గారికి నివాళులు అర్పించారు.

 

 

 

 

Please follow and like us:
0

You may also like...

Leave a Reply

Your email address will not be published.

Enjoy this blog? Please spread the word :)