రివ్యూ: తిప్పరామీసం !!!

టైటిల్‌: తిప్పరా మీసం
జానర్‌: థ్రిల్లర్‌
నటీనటులు: శ్రీవిష్ణు, నిక్కీ తంబోలీ, సీనియర్‌ నటి రోహిణి, బెనర్జీ,
దర్శకుడు: ఎల్‌ కృష్ణవిజయ్
నిర్మాత: రిజ్వాన్‌
సంగీతం: సురేశ్‌ బొబ్బిలి
డీవోపీ: సిద్‌

వైవిధ్యభరితమైన సినిమాల్లో నటిస్తూ తనకంటూ మంచి పేరు తెచ్చుకున్న నటుడు శ్రీవిష్ణు.. అప్పట్లో ఒకడుండేవాడు, నీది నాదీ ఒకే కథ, బ్రోచేవారెవరురా వంటి సినిమాలతో శ్రీవిష్ణు ప్రేక్షకుల్లో తనదైన ముద్ర వేశాడు. ఈ ఏడాది వచ్చిన బ్రోచేవారెవరుతో మంచి విజయాన్ని అందుకున్న ఈ యువ హీరో తాజాగా ‘తిప్పరా మీసం’ ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమా టీజర్‌, ట్రైలర్‌లో శ్రీవిష్ణు నెగటివ్‌ షెడ్స్‌తో డిఫరెంట్‌ లుక్‌లో కనిపించడంతో మంచి హైప్‌ క్రియేట్‌ అయింది. ఈ క్రమంలో శ్రీవిష్ణు ‘తిప్పరా మీసం’ అంటూ మరోసారి ప్రేక్షకులను అలరించాడా? మరో హిట్‌ను తన ఖాతాలో వేసుకున్నాడా? చూద్దాం.

కథ:

మణిశంకర్‌ (శ్రీవిష్ణు) చిన్న వయస్సులోనే చెడు సాహవాలతో డ్రగ్స్‌కు అలవాటుపడుతాడు. ఇలాగే వదిలేస్తే.. అతని పరిస్థితి చేయిదాటిపోతుందేమోనని, డ్రగ్స్‌కు పూర్తిగా బానిస అవుతాడేమోనని భయపడి తల్లి లలితాదేవి (రోహిణి) అతన్ని రిహాబిటేషన్‌ సెంటర్‌లో చేరుస్తోంది. అక్కడ ఎవరూ తోడులేక తీవ్ర ఒంటరితనంలో మగ్గిపోయిన మణి.. తల్లి మీద ద్వేషం పెంచుకుంటాడు. అక్కడి నుంచి పారిపోయి ఓ పబ్‌లో డీజేగా పనిచేస్తూ ఇష్టారాజ్యంగా బతుకుతుంటాడు. తల్లి ఇంటి గడప కూడా తొక్కని అతని.. డబ్బుల కోసం మాత్రం తల్లిని వేధిస్తుంటాడు. ఈ క్రమంలో ఓ క్రికెట్‌ బూకీ వద్ద తాను చేసిన అప్పును తీర్చేందుకు ఏకంగా తల్లి మీద మణి కోర్టులో కేసు వేస్తాడు. ఆమె రూ. 5 లక్షల చెక్కు ఇస్తే.. దానిని ఫోర్జరీ చేసి.. అది బౌన్స్‌ కావడంతో తల్లిని కోర్టుకీడుస్తాడు. ఏదీఏమైనా పరిస్థితులకు ఎదురెళ్లి తను అనుకున్నది సాధించాలనుకునే మణి.. అనూహ్య పరిణామాల నడుమ ఓ మర్డర్‌ కేసులో ఇరుక్కుంటాడు. కాళీతో గొడవలు ఉన్నప్పటికీ.. అతన్ని తాను హత్య చేసినట్టు చెప్పి మణి జైలుశిక్ష అనుభవిస్తాడు. అసలు కాళీని చంపిందెవరు? ఆ మర్డర్‌ కేసును మణి ఎందుకు ఒప్పుకున్నాడు? అసలు మణి మారిపోయి తల్లి ప్రేమను అంగీకరించి.. మంచి వాడిగా మారడానికి కారణమేమిటి? అన్నది తెరమీద చూడాలి.

విశ్లేషణ:

ప్ర‌పంచంలో అన్ని మారినా.. అమ్మ ప్రేమ మాత్రం ఎప్పటికీ మార‌దు. అలాంటి అమ్మ ప్రేమను ఈ సినిమాలో బలంగా చూపించటానికి చేసిన ప్రయత్నం మెచ్చుకోతగినిది. కథ సింపుల్ గా ఉన్న కొన్ని ఎమోషనల్ సీక్వెన్స్ ముఖ్యంగా సెకండ్ హాఫ్ లో హీరో మారే సన్నివేశాల క్రమం మరియు క్లైమాక్స్ అలాగే మెయిన్ గా హీరో తల్లి దగ్గరకి వచ్చి క్షమాపణ కోరే సీన్ చాల బాగుంది. ఇక శ్రీవిష్ణు మణిశంకర్ పాత్రలో అద్భుతంగా నటించారు. క్లిష్టమైన కొన్ని సన్నివేశాల్లో ఆయన నటన సినిమాకే ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. హీరోయిన్ తో సాగే లవ్ ట్రాక్ బాగానే ఉంది.

ఇక సీనియర్ నటి రోహిణి కూడా అమ్మ‌పాత్ర‌లో అద్భుతంగా న‌టించారు. కొడుకు మీద ప్రేమను వ్యక్త పరిచే ప్రతి సన్నివేశంలో ఆమె నటన ఎమోషనల్ గా కనెక్ట్ అవుతుంది. హీరోయిన్ గా నటించిన నిక్కీ తంబోలి కొన్ని లవ్ సీన్స్ లో అందంగా కనిపిస్తూ ఆకట్టుకుంది. అలాగే హీరోకి మామయ్య పాత్రలో కనిపించిన బెనర్జీ మరియు చెల్లిగా నటించిన నటి కూడా బాగా నటించారు. ఇతర పాత్రల్లో కనిపించిన మిగిలిన నటీనటులు తమ నటనతో ఆకట్టుకున్నారు.

మదర్ సెంటిమెంట్, యాక్షన్ ఎపిసోడ్స్ బాగున్నాయి. ఫైట్స్ ఇష్టపడే ఆడియన్స్ ఈ సినిమాను తప్పకుండా ఎంజాయ్ చేస్తారు. యూత్ ను ఆకట్టుకునే లవ్ ఎపిసోడ్స్ బాగున్నాయి. అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించే అంశాలు సినిమాలు ఉండడంతో తిప్పరా మీసం హిట్ సినిమాగా నిలిచే అవకాశాలు ఉన్నాయి. ఈ వీక్ ఎండ్ ఫ్యామిలి అందరూ కలిసి చూడగగ్గ సినిమా ఇది.

రేటింగ్: 3/5

Please follow and like us:
0

You may also like...

Leave a Reply

Your email address will not be published.

Enjoy this blog? Please spread the word :)