మిల్కీబ్యూటీ పెళ్ళిచేసుకోబోయే వరుడు ఎవరో తెలుసా

చిన్నవయసులోనే ఫిలిం ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది మిల్కీబ్యూటీ తమన్నా. తమన్నా సౌత్ ఫిలిం ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ అయినప్పటికీ ముందుగా బాలీవుడ్ లోనే తన ఎంట్రీ ఇచ్చింది. 15 ఏళ్ళ వయసులోనే సినీరంగంలో అడుగుపెట్టిన తమన్నా అతి తక్కువకాలంలోనే ఇటు సౌత్ ఇండస్ట్రీ అటు బాలీవుడ్ లోను మంచి గుర్తింపు తెచ్చుకుంది. తెలుగులో శ్రీ మూవీతో ఈ మిల్కీబ్యూటీ జర్నీ మొదలయ్యినప్పటికీ శేఖర్ కమ్ముల హ్యాపీ డేస్ మూవీతో గుర్తింపు సంపాదించుకుంది.

అందరు కుర్ర హీరోలతో తమన్నా ఆడి పాడింది. ఈ మిల్కీ బ్యూటీ కి ఈ మధ్యకాలంలో ఆఫర్స్ కొద్దిగా తగ్గినప్పటికీ తిరిగి బాహుబలి లాంటి మూవీలో నటించి తిరిగి అవకాశాలు అందుకుంటుంది. కళ్యాణ్ రం తో నా నువ్వే మూవీ లో నటించింది. ఇప్పుడు తమన్నా చిరంజీవి సరసన సైరా మూవీలో, వెంకటేష్ సరసన F2 మూవీలో నటిస్తుంది.

ఇప్పుడు తమన్నా త్వరలో పెళ్లి చేసుకోబోతుందని ఒక వార్త బాలీవుడ్ లో చక్కర్లు కొడుతుంది. దీని గురించి తమన్నా ఇప్పటివరకు ఏ మాత్రం స్పందించలేదు. హీరోయిన్స్ కి అవకాశాలు తగ్గగానే వారిపై సహజంగా వచ్చే పుకార్లు పెళ్లి చేసుకుంటున్నారని. కాని సమoత మాత్రం కెరీర్ పీక్ స్టేజిలో ఉన్నప్పుడే పెళ్లి చేసుకొని తిరిగి సినిమాల్లో నటిస్తుంది. అలానే తమన్నా కూడా సినిమాలు చేస్తూనే సరైన టైం లో పెళ్లి చేసుకోవాలి అనుకుందేమో మరి.

మిల్కీబ్యూటీకి కాబోయే వరుడు అమెరికాలో పెద్ద డాక్టర్ అని, అంతే కాకుండా చాలా బిజినెస్ లు కూడా ఉన్నాయి అని, ఈ పెళ్లి గురించి ఇరు కుటుంబాలు ఓకే చెప్పారని త్వరలో ఎంగేజ్మెంట్ చేసుకుంటున్నట్లు న్యూస్ వైరల్ అయ్యింది. మరి తమన్నా కూడా పెళ్లి చేసుకొని సినిమాలకు గుడ్ బాయ్ చెప్పి అమెరికాలో సెటిల్ అవుతుందో లేదా ఎప్పటిలాగే ఇవన్నీ పుకార్లే అని కొట్టిపారేస్తుందో చూడాలి.

Please follow and like us:
0

You may also like...

Leave a Reply

Your email address will not be published.

Enjoy this blog? Please spread the word :)