తగినంత నీరు తాగకపోతే మీ బాడీకి జరిగే హాని ఏంటో మీకు తెలుసా?

మానవ శరీరానికి అతి ముఖ్యమైనది నీరు. ఆహారం తీసుకోకపోయిన కొద్ది రోజులు ఉండవచ్చు. కాని నీరు తాగకుండా మాత్రం ఉండలేము. ముఖ్యంగా వేసవికాలంలో మన శరీరానికి ఎక్కువ నీరు అవసరం. ఎండాకాలంలో సాధారణoగా వచ్చే సమస్యల్లో ముఖ్యంగా వడదెబ్బ ఒకటి. వడదెబ్బ అంటే శరీరానికి కావలసినంత నీరు అందకపోవడం. దీనినే డీహైడ్రేషన్ అని కూడా అంటారు. ఇది చాలా ప్రమాదకరమైనవి. మనలో చాలా మంది ఈ సమ్మర్ లో వడదెబ్బ బారిన పడే ఉంటారు. మనం తగినంత నీరు తీసుకోకపోతే దాని వలన మన శరీరానికి జరిగే హాని గురించి మీకు తెలుసా? చాలా రకాల దుష్ప్రభావాలు కలుగుతాయి. వాటిలో కొన్నింటిని గురించి ఇప్పుడు తెలుసుకుందాo.

చెడు శ్వాస( బాడ్ బ్రీత్):

మన నోరు ఉత్పత్తి చేసే లాలాజలం ఆహారాన్ని జీర్ణం చేయడంలో సహాయపడే ఎంజైమ్స్ ని కలిగి ఉంటుంది మరియు నాలుక మరియు నోటి కణజాలాల నుండి బ్యాక్టీరియాని  శుభ్రం చేయడానికి కూడా సహాయపడుతుంది. అయితే, మీరు తగినంత వాటర్ ని తాగకపోతే, తక్కువ లాలాజలం ఉత్పత్తి మీ నోటిలో జరుగుతుంది. ఇది చెడు శ్వాసకి దారి తీస్తుంది.

కళ్ళ కింద నలుపు మరియు పొడిబారిన కళ్ళు:

డీహైడ్రేషన్ కంటి ఆరోగ్యాన్ని ప్రతికూలంగా ప్రభావితం చేస్తుంది. కళ్ళు కంటి ఉపరితల తేమను కలుగజేయడానికి తగినంత కన్నీళ్లను ఉత్పత్తి చేయని పొడి బారిన కళ్ళ పరిస్థితులతో బాధపడుతున్నవారు, తక్కువ నీటిని తీసుకోవడం ద్వారా తీవ్ర ప్రభావాలను అనుభవించవచ్చు. తగినంత నీరు తాగకపోయినా కళ్ళు లోపలి పోయినట్టు కనిపించడం మరియు కళ్ళ కింద నల్లటి వలయాలు ఏర్పడడం జరుగుతుంది.

పొడి నాలుక:

తగినంత నీటిని తాగకపోవడంవలన నోటిలో లాలాజల ఉత్పత్తి తక్కువగా ఉండటం వలన నాలుక ఎండిపోయినట్టుగా పొడి బారినట్టు అవుతుంది. ఇది నోటిలో ఒక రకమైన అసౌకర్యవంతమైన సంచలనాన్ని కలిగిస్తుంది, నాలుక కదలికలను కష్టతరం చేస్తుంది.

పసుపు రంగులో మూత్రం రావడం:

మూత్రం యొక్క రంగు మీ బాడీ డీహైడ్రేషన్ ని స్పష్టంగా తెలియజేస్తుంది. మరియు లేత పసుపు రంగుకు బదులుగా ముదురు నారింజ రంగులో మూత్రం ఉంటే అది శరీరానికి చాలా హానిని కలిగిస్తుంది. యూరో క్రోమ్ యూరిన్ కి పేల్ యెల్లో కలర్ ఇస్తుంది మరియు ఆ కలర్ మరింత డార్క్ అయితే ఆ వ్యక్తికీ చాలా ఎక్కువ డీహైడ్రేషన్ కలిగింది అని తెలుసుకోవచ్చు.

Please follow and like us:
0

You may also like...

Leave a Reply

Your email address will not be published.

Enjoy this blog? Please spread the word :)