telugu gods devotional information in telugu
తిరుమల మంగళవారం విశిష్ట సేవ
మంగళ వారం నాటి శ్రీవారి సేవలు.
అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు అయినటువంటి శ్రీ వారికి నిత్య సేవలతో పాటు మంగళవారం స్వర్ణ అష్టోత్తర పద్మములతో స్వామి వారికి పాద పద్మారాధన చేస్తారు.
శ్రీ వారి ttd స్వర్ణోత్సవాల సంధర్భంగా ప్రవేశ పెట్టబడిన సేవ. ఒక ఇస్లాం భక్తుడు వారి కుటుంబ సభ్యుల సహకారంతో స్వామి కి సమర్పణ చేసిన ఒక్కొక్క పుష్పం షుమారు 24గ్రాముల బంగారువి మొత్తం 108.
స్వామి వారికి ప్రత్యేకంగా నిత్య కైంకర్యాల్లో భాగంగా ప్రతి మంగళ వారం రోజున స్వామి వారికి అష్టోత్తర శతనామాలను చదువుతూ స్వామి వారి పాదాలకు సమర్పణ చేస్తారు ఆచార్యుల వారు. ఇదొక అద్బుతమైన సేవ చూడాలంటే అదృష్టం కావలసిందే.
ఓం నమో వేంకటేశాయ.