ఈరోజు చేయాల్సిన ప్రత్యేక ఆరాధనలు

ఈరోజు కి ఉన్నటువంటి ప్రత్యేకతలు చేయాల్సిన ఆరాధన క్రమము.

కార్తీక శుద్ధ దశమి, హస్తా నక్షత్ర యుక్త ఆదివారం.కార్తీక మాసం లోని ప్రతీరోజు విశిష్టవంతమైందే. అలగే ఈరోజు కి ఉన్నటువంటి ప్రత్యేకత తెలుసుకుందాం.

ఈరోజు ఆదివారం సూర్యుని ఆరాధనకు, అరుణపారయణ కు , నమస్కార, ఆర్ఘ్యపాద్యాలు ఇవ్వడం వంటి వాటికి అత్యంత అనుకులమైంది.

దశమి తిధి యముని యొక్క ఉపాసన కు ఉపయోగ కరమైనది. ఆయుష్షు సంబంధిత దోషాలు గలవారు యముని ఆరాధన ప్రతి పక్షం లో వచ్చే దశమి నాడు చేయడం అన్నది చెప్పబడింది.

ఇకపోతే దశమి నాడు శ్రీ హరి సంబంధిత త్రిరాత్రి వ్రతం మొదలు పెట్టడం కోసం అనువైన రోజు. శ్రీహరి నామము సదా జపించువారి గురించి యముడు కూడా ఆలోచన చేయడానికి ఆలోచిస్తాడు అని భజగోవిందమ్ లో శంకరులు అన్నట్టుగ దశమి నాడు శ్రీమహావిష్ణువు నామ జపం అన్నది సకల మృత్యు దోషాలు పోగొడుతుంది.

హస్త నక్షత్రం ఉంది కాబట్టి ఆది పూజలు అందుకునే వినాయకుని ఆరాధన కు కూడా ఉపయోగకరమైందే.
ఓం నమో నారాయణాయ

Please follow and like us:
0

You may also like...

Leave a Reply

Your email address will not be published.

Enjoy this blog? Please spread the word :)