దొరసాని సినిమా గురించి అందరికీ గొప్పగా చెబుతుంటే చాలా ఆనందంగా ఉండేది – శివాత్మిక రాజశేఖర్

ఆనంద్ దేవరకొండ, శివాత్మక లను హీరో హీరోయిన్లుగా పరిచయం చేస్తూ మధుర ఎంటర్ టైన్మెంట్, బిగ్ బెన్ సినిమాలు సంయుక్తంగా నిర్మిస్తున్న మూవీ ‘దొరసాని’ జులై 12న గ్రాండ్ గా రిలీజ్ అవుతున్న ఈమూవీ ట్రైలర్, పాటలతో ప్రేక్షకుల మనసులో ప్రత్యేకమైన ముద్రను వేసింది. కె.వి.ఆర్. దర్శకునిగా పరిచయం అవుతున్న ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఆదివారం జరగనుంది. దొరసాని ప్రమోషన్స్ లో బాగంగా ఈ రోజు మీడియా తో ముచ్చటించారు హీరోయిన్ శివాత్మిక

నేనూ దొరసాని కోసం ఎదురుచూసాను:
ఈ కథ వింటున్నప్పుడు నా పాత్ర బాగా నచ్చింది. దర్శకుడు మహేంద్ర ఆ క్యారెక్టర్ ని వివరించిన విధానం నన్ను బాగా ఇంప్రెస్ చేసింది. మొత్తం
నాలుగు గంటల సేపు కథ చెప్పారు. ఆ తర్వాత ఆడిషన్స్ నన్ను ఆనంద్ ని కలిపే చేసారు. ఆడిషన్స్ కూడా అయ్యాక రెండు నెలలు నాకు ఎలాంటి కబురు అందలేదు. ఆ టైం లో ఆ పాత్ర కోసం నేను ఎదురుచూసాను. నేనే అని తెలిసాక చాలా ఎగ్జైట్ అయ్యాను.

దర్శకుడు కె.వి.ఆర్ మహేంద్ర చాలా ఖచ్చితంగా ఉంటారు:
పాత్రలకోసం రాసుకున్న సన్నివేశాలు ఏమీ లేవు. ఆయన కథతోనే మమ్మల్ని ముందుకు తీసుకెళ్ళారు. నేను ఒక డైలాగ్ చెప్పకుండానే నన్ను సెలెక్ట్ చేసానని షూటింగ్ అయ్యాక చెప్పారు. ఆయన సన్నివేశాలను బాగా ఎక్స్ ప్లెయిన్ చేస్తారు. ఆయన చెప్పిన దాన్ని చేసుకొని చేసుకుంటూ వెళితే చాలు. మొదటి సన్నివేశానికి చాలా టెన్షన్ పడ్డాను, కానీ దర్శకుడు ఇచ్చిన కాన్ఫిడెన్స్ నన్ను నడిపించింది.

అమ్మ సినిమాలే నాకు రిఫరెన్స్:
ఈ కథ 80 దశకాల్లో జరిగే కథ అప్పటి కట్టు బొట్టు గురించి నాకు పెద్దగా తెలియదు. తలంబ్రాలు టైం లో అమ్మ అలంకరణ, స్టైల్ ని రిఫరెన్స్ లా
తీసుకున్నాను. అచ్చం అమ్మాలాగే ఉన్నావని షూటింగ్ లోకేషన్స్ లో అంటుంటే చాలా హ్యాపీగా అనిపించింది. అమ్మ నాకు ఒకటే చెప్పేవారు ఏ క్యారెక్టర్ చేస్తున్నా ఇన్వాల్వ్ అయి చేయమని చెప్పేవారు. అమ్మ నాకు ఎప్పుడూ ఒక ఎనర్జీ సోర్స్ లాగా ఉంటుంది.

రాజశేఖర్ కూతురి గా ఆనందమే ఎక్కువ:
నాన్న కుండే ఇమేజ్ ని చిన్నతనం నుండి చూస్తూ పెరిగాను. ఈ మద్యనే కల్కి రిలీజ్ అయి ఆ సినిమా తెచ్చిన సందండి ఇంట్లో తగ్గకముందే నా సినిమా రిలీజ్ కి వచ్చేసింది. నాన్న నా సినిమా గురించి అందరికీ గొప్పగా చెబుతుంటే చాలా ఆనందంగా ఒక పక్క టెన్షన్ గా కూడా ఉంది. నాన్న ఇమేజ్ తెచ్చే ఒత్తిడి కంటే ఆనందమే ఎక్కువ . నాన్న డైరెక్టర్స్ హీరో గానే ఉన్నారు,నేను అదే ఫాలో అవుతున్నాను.

ఆనంద్ దేవరకొండ బెస్ట్ :
ఆనంద్ తో వర్క్ చేయడం చాలా కంఫర్ట్ గా ఉంది. చాలా తక్కువ మాట్లాడతాడు. కానీ షూటింగ్ లో నెమ్మదిగా ఫ్రెండ్స్ అయ్యాము. నా కుంటే ముందే ఆనంద్ సెలెక్ట్ అయ్యాడు. సెట్ కి వెళ్ళాక రాజు క్యారెక్టర్ ఆనంద్ కంటే బెటర్ గా ఎవరూ చేయరేమో అనిపించింది. చాలా బాగా హార్డ్ వర్క్ చేసాడు. తెలంగాణ స్లాంగ్ కోసం చాలా బాగా ప్రాక్టీస్ చేసాడు. అతని నటన గురించి రిలీజ్ అయ్యాక మాట్లాడుకుంటారు. ప్రేక్షకులు ఇచ్చే ఫీడ్ బ్యాక్ కోసం ఎదురు చూస్తున్నాను.

నటిస్తున్నారు. సురేష్ బాబు సమర్పణలో వస్తోన్న ఈ చిత్రానికి,సినిమాటోగ్రఫీ : సన్నీ కూరపాటి,ఎడిటర్ : నవీన్ నూలి,సంగీతం : ప్రశాంత్ ఆర్ విహారి. ఆర్ట్ డైరెక్టర్ : జెకె మూర్తి,పి.ఆర్.వో : జి.ఎస్.కె మీడియా, కో ప్రొడ్యూసర్ : ధీరజ్ మొగిలినేని,నిర్మాతలు : మధుర శ్రీధర్ రెడ్డి, యశ్ రంగినేని
రచన, దర్శకత్వం : కె.వి.ఆర్. మహేంద్ర

Please follow and like us:
0

You may also like...

Leave a Reply

Your email address will not be published.

Enjoy this blog? Please spread the word :)