movie reviews

సిల్లీ ఫెలోస్ మూవీ రివ్యూ

నటీనటులు :  అల్లరి నరేష్, సునీల్, పూర్ణ , చిత్రశుక్ల, జయ ప్రకాష్ రెడ్డి, పోసాని కృష్ణ మురళి, బ్రహ్మానందం తదితరులు.

సినిమాటోగ్రఫర్ : అనీష్ తరుణ్ కుమార్

స్క్రీన్ ప్లే : భీమనేని శ్రీనివాసరావు

ఎడిటర్ : గౌతమ్ రాజు

దర్శకత్వం : భీమనేని శ్రీనివాసరావు

నిర్మాతలు : కిరణ్ రెడ్డి, భరత్ చౌదరి

సంగీతం : శ్రీ వసంత్

భీమినేని శ్రీనివాసరావు రీమేక్‌ చిత్రాల స్పెషలిస్ట్ గా టాలీవుడ్ లో పేరు తెచ్చుకున్నాడు. అల్లరి సినిమాతో టాలీవుడ్ లో హీరోగా తెరంగేట్రం చేసి ఆ సినిమా పేరునే తన ఇంటి పేరుగా మార్చుకున్నాడు అల్లరి నరేష్. కామెడీ హీరోగా మంచి పేరు తెచ్చుకున్నాడు.  టాప్ కమెడియన్ గా ఉన్న సునీల్ హీరో అవతారమెత్తి ఒకటి, రెండు సినిమాలతో విజయాన్ని అందుకున్నాడు. అయితే ఇప్పుడు కొన్ని వరుస ఫ్లాప్‌లతో ఇబ్బందుల్లో ఉన్న ఈ ఇద్దరు ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన కామెడీ ఎంటర్‌టైనర్‌ silly fellows. భీమనేని శ్రీనివాసరావు తమిళంలో విజయవంతమైన ఓ చిత్రం ఆధారంగా ఈ సినిమాను రూపొందించాడు. కామెడీ ఎంటర్టైనర్ గా రూపొందిన ఈ చిత్రంలో పూర్ణ, చిత్ర శుక్ల హీరోయిన్లుగా నటించారు. కాగా కిరణ్ రెడ్డి, భరత్ చౌదరి నిర్మాణంలో తెరకెక్కిన ఈ చిత్రం ఈ రోజు విడుదల అయింది. మరి ఈ సినిమా ప్రేక్షకులును ఏ మేరకు మెప్పించిందో తెలియాలంటే కథలోకి వెళ్లి తెలుసుకుందాం!

కథ :

వీరబాబు (allari naresh), సూరి బాబు (సునీల్‌) ఇద్దరు సత్యనారాయణపురం ఎమ్మెల్యే జాకెట్ జానకీ రాం(జయప్రకాష్ రెడ్డి) కి కుడి భుజం, ఎడమ భుజంలా ఉంటారు. వీరబాబు వాసంతి అనే అమ్మాయిని లవ్ చేస్తాడు. ఆ ఎమ్మెల్యేకి చెడ్డపేరు తెచ్చి, అతనికి రావలసిన మంత్రి పదవిని తాను దక్కించుకోవాలని చూస్తుంటాడు మరో ఎమ్మెల్యే (రాజా రవింద్ర). రాజా రవీంద్ర కుట్ర వల్ల ఓ కార్యక్రమంలో జాకెట్‌ పరువు కాపాడటం కోసం సూరిబాబు, రికార్డింగ్‌ డ్యాన్సులు చేసే పుష్ప(బిగ్‌బాస్‌ ఫేం నందిని)లకి పెళ్లి చేస్తాడు. దాంతో సూరిబాబు ప్రేమించి పెళ్లిచేసుకోబోయే అమ్మాయి (పూర్ణ) అతన్ని అసహ్యించుకుంటుంది. పుష్పతో ఎటువంటి సంబంధం లేదని ప్రూవ్ చేస్తేనే మనం ఒకటవుతాం అని కండీషన్ పెడుతుంది. దానిని నిరూపించడానికి సూరిబాబు ఏం ప్లాన్స్ వేశాడు ? ఆ ప్లాన్స్ ని కూడా వీరబాబు తన లవ్ కి అనుగుణంగా ఎలా వాడుకున్నాడు ? తనూ ప్రేమించిన వాసంతిని చివరకి దక్కించుకున్నాడా? మరి సూరిబాబు పుష్పని ఎలా వదిలించుకున్నాడు? లాంటి విషయాలు తెలియాలంటే ఈ చిత్రం చూడా ల్సిందే.

విశ్లేషణ:
తమిళంలో హిట్ కొట్టిన ‘వెలైను వంధుట్ట వెల్లకారన్‌’ సినిమాను తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా కొద్దిగా మార్పులు చేర్పులు చేసి రీమేక్‌ చేశారు. రీమేక్‌ స్పెషలిస్ట్ గా పేరున్న దర్శకుడు భీమినేని శ్రీనివాస్‌ రావు కరెక్ట్ మూవీని రీమేక్ చేయడానికి తీసుకొని ఉంటే బాగుండేది. ఈ తరహా చిత్రాలు మన తెలుగులో చాలా వచ్చాయి. దీంతో మరోసారి రొటీన్‌ కామెడీ సినిమా చూస్తున్న ఫీలింగ్ కలుగుతుంది. చెప్పుకోదగ్గ కథాకథనాలేమీ లేకుండా కేవలం లౌడ్ కామెడీని నమ్ముకుని లాగించేసిన సినిమా ఇది. అసలెక్కడా లాజిక్ అనే మాటే కనిపించదు. కానీ ఔట్ డేటెడ్ అయిపోయిన కామెడీ సీన్లు ప్రేక్షకులకు నవ్వు తెప్పించలేకపోయాయి. సినిమాలో ప్రతి సీన్ కూడా సిల్లీగానే అనిపిస్తుంది.  ఫస్ట్ హాఫ్‌ ప్రధాన పాత్రల పరిచయం, మంచి కామెడీ సీన్స్‌ తో ఆకట్టుకున్న డైరెక్టర్ సెకండ్ హాఫ్ లో పూర్తిగా నిరాసపరిచాడు.  పెద్దగా కథ లేకపోవటంతో ఒకే సన్నివేశాన్ని సాగదీస్తూ టైం పాస్‌ చేశారు. ముఖ్యంగా జయప్రకాష్‌ రెడ్డి, పోసాని కృష్ణమురళీల మధ్య సన్నివేశాలు ప్రేక్షకుల సహనాన్ని పరీక్షిస్తాయి. హీరో హీరోయిన్‌ల మధ్య ప్రేమ సన్నివేశాల విషయంలోనూ ఇంకాస్త దృష్టి పెట్టాల్సింది ప్రధాన బలమైన క్యారెక్టర్లే ఇక్కడ తేలిపోవడంతో ‘silly fellows’ బలహీనంగా తయారైంది. sillyfellows చూడడానికి నిజంగానే సిల్లీగా అనిపిస్తుంది.

నటీనటులు:

కామెడీ హీరోగా మంచి పేరు తెచ్చుకున్న ఈ మధ్య కొంచెం ప్లాప్స్ తో సతమతమవుతున్ప్పటికి నరేష్ మరోసారి తన ఇమేజ్‌కు తగ్గ కామెడీ ఎంటర్‌టైనర్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అల్లరి నరేష్ గత తన సినిమాల్లో కంటే ఈ సినిమాలో ఫ్రెష్ గా కనిపించాడు. అయితే రొటీన్‌ ఫార్ములానే ఫాలో అయ్యాడు. వీరబాబు పాత్రకు పూర్తి న్యాయం చేశాడు. కమెడియన్‌గా రీ ఎంట్రీ ఇచ్చిన సునీల్‌ తనదైన కామెడీ టైమింగ్‌తో ఆకట్టుకున్నాడు. హీరోయిన్‌గా చిత్ర శుక్లా పరవాలేదనిపించారు. వాసంతి పాత్రలో యాక్షన్‌ సీన్స్ లోనూ ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. పోలీస్ ఆఫీసర్ గా కూడా ఆమె చాలా కాన్ఫిడెంట్ గా నటించి మెప్పించింది. అలాగే గెస్ట్ రోల్ లో కనిపించిన పూర్ణ కూడా ఉన్నంతలో తన మార్క్ నటన కనబరిచింది. సినిమాలో కీలక పాత్ర అయిన పుష్పగా నటించిన నందిని రాయ్ ట్రాక్ కూడా పర్వాలేదనిపిస్తోంది. జయ ప్రకాష్‌ రెడ్డి, పోసాని కృష్ణమురళి, రాజా రవీంద్ర రొటీన్‌ పాత్రల్లో కనిపించారు.

సాంకేతిక విభాగం :
దర్శకుడిగా భీమినేని శ్రీనివాస్ అసలు ఏ మాత్రం మెప్పించలేకపోయారు. సినిమాలో అన్ని ఔట్ డేటెడ్ విషయాలే కనిపిస్తాయి. దర్శకుడు బీమనేని శ్రీనివాసరావు కామెడీని పండించే ప్రయత్నం చేసినా, అయన పూర్తిగా ఆకట్టుకోలేకపోయారు. అనీష్ తరుణ్ కుమార్ సినిమాటోగ్రఫీ బాగుంది. శ్రీ వసంత్ పాటల్లో ఒక్కటీ గుర్తుంచుకోదగ్గది లేదు. సీనియర్ ఎడిటర్ గౌతమ్ రాజు ఎడిటింగ్ పనితనం ఈ సినిమాకి ప్లస్ అయింది. సినిమాలోని నిర్మాతలు కిరణ్ రెడ్డి, భరత్ చౌదరి పాటించిన ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి.

ప్లస్‌ పాయింట్స్‌ :
కామెడీ
నరేష్‌, సునీల్‌ నటన

మైనస్‌ పాయింట్స్‌ :
రొటీన్‌ కథా కథనం
సెకండ్‌ హాఫ్

తీర్పు :

ఈ సినిమా కేవలం సిల్లీగా సాగుతుంది. కానీ ఈ సినిమా బి.సి ప్రేక్షకులను ఎంటర్టైన్ చెయ్యొచ్చు.

 

Tags

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button