కోటి తగ్గనంటున్న ఒకప్పటి విలన్

ప్రస్తుతం టాలీవుడ్ లో విలన్ల కొరత బాగానే ఉంది. నటుడు శ్రీహరి మరణంతో హీరో జగపతి బాబు విలన్ గా మారడంతో కొంత మేర తగ్గింది కానీ పూర్తిగా పోలేదు. సరే పోనీ నటుడు ప్రకాష్ రాజ్ ఉన్నాడనుకుంటే ఆయన దురుసుతనంతో పరిశ్రమకు దూరం అయ్యారు. దాంతో ఆ లోటు అలాగే ఉంది. మధ్యలో ఒకరిద్దరు కుర్ర విలన్లు వచ్చినా వారెవరూ తెలుగు ప్రేక్షకులకు నచ్చలేదు. దాంతో ఒకప్పటి విలన్, సీనియర్ విలన్ అయిన సోను సూద్ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలి అనుకుంటున్నాడు. ఇందుకోసం మళ్ళీ తెలుగు సినిమాలలో నటించడానికి అంగీకరించాడు. సరే మరి పారితోషకం ఎంత అంటే ‘కోటి’ కి తగ్గనంటున్నాడు. ఇది కాస్త ఎక్కువే అయిన ప్రస్తుతం మన హీరోలకు ఆ స్థాయిలో పోటీ ఇచ్చే ప్రతీ నాయకుడు తెర పై లేనందువల్ల సోను అడిగినంతా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు దర్శకనిర్మాతలు.

ప్రస్తుతం సోను సూద్ తేజ దర్శకత్వంలో మొదలైన బెల్లంకొండ శ్రీనివాస్ సినిమాలో విలన్ గా నటించనున్నాడు. ఈ సినిమాలో కాజల్ హీరోయిన్. ఈ సినిమా నిన్ననే ప్రారంభం అయింది.

Please follow and like us:
0

You may also like...

Leave a Reply

Your email address will not be published.

Enjoy this blog? Please spread the word :)