health tips in telugu

బరువు తగ్గాలనుకుంటున్నారా? అయితే ఈ ఒక్క డ్రింక్ కి దూరంగా ఉండండి.

బరువు తగ్గాలి అనుకునే వాళ్ళు డైటింగ్, ఎక్సర్సైజులు మాత్రమే చేస్తే సరిపోదు. ఒక ఆరోగ్యకరమైన పద్ధతిలో బరువు తగ్గడం ముఖ్యం. ఈ క్రమంలో ముందుగా మనo చేసేది డైటింగ్. డైటింగ్ అంటే తినడం పూర్తిగా మానేయడం మాత్రం కాదు. హెల్తీ ఫుడ్ సరైన టైంకి మితంగా తీసుకోవడo, ఎక్కువగా లిక్విడ్ డైట్ తీసుకోవడం. ఎక్కువగా వాటర్ తాగడం ముఖ్యం. మనం బరువు పెరగడానికి ముఖ్య కారణం అధికంగా షుగర్, ఉప్పు, అన్ హెల్తీ ఫాట్స్ ఎక్కువగా ఉన్న ప్రాసెసడ్ ఫుడ్ మరియు శీతల పానీయాలు (బెవేరేజ్స్ /కూల్ డ్రింక్స్) తీసుకుంటాము. వీటిలో ముఖ్యంగా యూత్ ఎక్కువగా యూస్ చేసేవి ఫిజ్ బెవేరేజేస్. పార్టీలలో, మనకు నచ్చిన ప్రోగ్రాం టీవీలో వస్తున్నప్పుడు, రెస్టారెంట్స్ కి వెళ్ళినప్పుడు, వేసవిలో దాహాన్ని తీర్చుకోవడానికి ఈ fizz బెవేరేజస్ ని తీసుకుంటాము. దీనివల్ల మనకు తెలీకుండానే మన బాడీలోకి టన్నుల కొద్ది షుగర్ ని, అనవసరమైన కెలోరీస్ ని నింపుతుoటాము. ఈ బెవేరేజేస్ లో అతి ప్రమాదకరమైన ఒక డ్రింక్ “సోడా”. ఇది మన హెల్త్ కి చాలా ప్రమాదకరమైనది.

ఈ డ్రింక్ వల్ల ఎక్కువ మోతాదులో మన ఆరోగ్యానికి హాని కలిగించే కెలోరీస్ బాడీలో వచ్చి చేరుతాయి. ఒక డేటా ప్రకారం, రెగ్యులర్ సోడా 200 కేలరీలు మన శరీరంలోకి తీసుకువెళుతుంది, కానీ అదే ఒక పెద్ద కప్పులో ఫౌంటెన్ సోడాను కొంటే, అది 400 కేలరీలు వరాకు బాడీలో చేరతాయి. ఈ డ్రింక్ వల్ల జరిగే మరొక చెడు ఏమిటంటే మన బాడీలోకి అధిక మోతాదులో షుగర్ చేరడం. మీరు ఒక సోడా తాగితే దాదాపు 10 స్పూన్స్ చక్కర ఒక్కసారి తీసుకున్నట్లే.

హెల్త్ గైడ్ లైన్స్ ప్రకారం, రోజుకు 6 టీ స్పూన్స్ కంటే ఎక్కువ తీసుకుంటే అది చాలా డేంజర్. అంతేకాకుండా మరో అధ్వాన్నమైన విషయం ఏమిటంటే సోడా మీ ఆకలిని నింపకపోగా, కొంతసేపటికే మరల ఆకలివేస్తున్నట్లు అనిపిస్తుంది దీని వల్ల రెట్టింపు కెలొరీస్ మీ బాడీలో చేరడం ఖాయo.

ఈ డ్రింక్ వల్ల మధుమేహం, ఊబకాయం మరియు గుండె జబ్బులు వంటి ప్రమాదకరమైన ఆరోగ్య సమస్యలు  కూడా వచ్చే అవకాశాలు ఎక్కువ. ఒకవేళ మీరు డైట్ సోడా తీసుకుంటాం అని అనుకున్న దాని వల్ల కూడా ఇవే ఆరోగ్య సమస్యలు ఎదురవుతాయి. సో ఒకవేళ ఈ డ్రింక్ ఎక్కువగా తీసుకునేవారు ఇకముందు దీనికి దూరంగా ఉండండి. ఓవర్ వెయిట్ ఉన్నవాళ్ళు మరింత వెయిట్ పెరగకుండా ఉండొచ్చు. ట్రై ఇట్ !

Tags

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button