sarkar release fever to unit

రిలీజ్ కి ముందే సర్కార్ కి ఎదురు దెబ్బలు

తమిళ నాట అగ్ర కథానాయకుడు ,ఇళయ దళపతి విజయ్ హీరోగా మురుగదాస్ దర్శకత్వం లో భారీ అంచనాలతో రూపొందిన చిత్రం సర్కార్ ఈ నెల 6న దీపావళి కానుకగా ఇరు రాష్ట్రాల్లో సందడి చేయనుంది. పెద్ద హీరో సినిమా దాంతో పాటు పండగ సంధర్బంగా స్పెషల్ షో లకు ప్రభుత్వం అనుమతులు ఇవ్వడం పరిపాటి అయినప్పటికీ కూడ ఒక సాధరణ సోషల్ యాక్టివిటీ మెంబర్ వేసిన పిటిషన్ తో మద్రాస్ హైకోర్ట్ స్పెషల్ షోలకు నిలుపుదల తీర్పు వెల్లడించి ఇటు అభిమానులను అటు చిత్ర యూనిట్ ని నిరాశ పరిచింది.

  1. స్పెషల్ షోలు రద్దు కావడం తో ఆ ప్రభావం కలెక్షన్ మీద పడుతుంది అన్న యోచనలో యూనిట్ కొద్దిగా నిరాశ లో ఉంది. మొన్నీమధ్య కథ తనదే అంటు వచ్చిన వివాదాన్ని కోర్ట్ బయట సెటిల్ చేసుకున్న మురుగదాస్ కి మళ్ళీ ఓ కొత్త చిక్కు ఇది. విజయ్ సినిమా అంటేనే వివాదం లేకుండా ఉండదు. ఇదే అయన సక్సస్ ఫార్ములా ఏమో . . ఏదేమైనా సన్ పిక్చర్స్ సమర్పిస్తున్న ఈ చిత్రం విజయం సాధించాలని అభిమానులతో పాటు మనం కోరుకుందాం
Please follow and like us:
0

You may also like...

Leave a Reply

Your email address will not be published.

Enjoy this blog? Please spread the word :)