సర్కార్ కోసం దళపతి

కోలీవుడ్ లో అగ్రహీరోగా ఎన్నో సూపర్ హిట్ మూవీస్ లో నటించిన విజయ్ మూవీస్ కి తెలుగులో కూడా మంచి క్రేజ్ ఉంది. అందుకే విజయ్ నటించిన కొన్ని సినిమాలను తెలుగులోకి డబ్ చేసి రిలీజ్ చేస్తుంటారు. మరియు అతను నటించిన మరికొన్ని మూవీస్ ని టాలీవుడ్ లోని అగ్రహీరోలు రీమేక్ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. రీసెంట్ గా విజయ్ నటించిన మెర్సల్ మూవీ తెలుగులో “అదిరింది” గా విడుదల అయ్యి ఇక్కడ కూడా హిట్ టాక్ తెచ్చుకుంది. ఇళయ దళపతి తమిళంలో ఇప్పుడు నటిస్తున్న 62 వ సినిమా ‘sarkar ‘. మురుగదాస్ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నాడు. ఇది ఒక పొలిటికల్ బ్యాక్ డ్రాప్ తో రానుంది. వీరి కాంబినేషన్‌ లో వచ్చిన తుపాకి, కత్తి సినిమాలు సూపర్ హిట్స్ అవడంతో sarkar పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఈ సినిమాను  సన్‌ పిక్చర్స్‌ భారీ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. ఈ సినిమాలో విజయ్ సరసన కీర్తి సురేష్, వరలక్ష్మి శరత్ కుమార్ లు హీరోయిన్ గా నటిస్తున్నారు. ప్రస్తుతం ప్రొడక్షన్‌ పనుల్లో బిజీగా వున్నారు.

చిత్ర యూనిట్ ఈ sarkar ఆడియో రిలీజ్ ఫంక్షన్ ను అక్టోబర్ 2 న గ్రాండ్ గా నిర్వహించాలని ప్లాన్ చేసారు. ఇటీవలే అమెరికాలో షూటింగ్ పూర్తి చేసుకుంది సర్కార్ మూవీ టీమ్. తాజా సమాచారం ప్రకారం ఆడియో రిలీజ్ ఈవెంట్ కి ముఖ్య అతిధిగా దళపతి సూపర్ స్టార్ రజినీకాంత్ హాజరు కానున్నారు. ఈవేడుకకు చెన్నై లోని క్రికెట్ స్టేడియం చేపాక్ వేదిక కానుంది. ప్రస్తుతం పర్మిషన్ కోసం ఎదురు చూస్తున్నారు. ఒక వేళ స్టేడియంలో పర్మిషన్ దొరకకపోతే నెహ్రు ఇండోర్ స్టేడియంలో కానీ లేక వై ఎమ్ సి ఏ స్టేడియంలో ఈ వేడుకను జరిపేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సినిమాని దీపావళి పండుగ కు రిలీజ్ చేయ్యలని ప్లాన్ చేస్తున్నారు.

ఇద్దరు సూపర్‌ స్టార్లు ఒకే వేదికపై కనపడితే ఇక అభిమానుల ఆనందానికి అవధులు ఉండవనే చెప్పాలి. అందువల్ల ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో అభిమానులు హాజరవుతారని అంచనాల వేస్తున్నారు.అందుకు తగ్గట్టుగా ఏర్పాట్లు ఉండేలా జాగ్రత్త పడుతున్నారు. ఇప్పుడు రజినీకాంత్ కొత్త సినిమా “పెట్ట” ను కూడా సన్ పిక్చర్స్ సంస్థ నిర్మిస్తుండటంతో రజినీకాంత్ ను స్పెషల్ గెస్ట్ గా ఆడియో ఫంక్షన్ కి ఆహ్వానిoచారని సమాచారం.

 

Please follow and like us:
0

You may also like...

Leave a Reply

Your email address will not be published.

Enjoy this blog? Please spread the word :)