ఆటో డ్రైవరుగా ఫిదా హీరోయిన్

ఫిదా చిత్రం తో తెలంగాణ యాసలో డయలాగ్లతో యువతను హోరెత్తించిన అమ్మడు సాయి పల్లవి ఆ తర్వాత నేచురల్ స్టార్ నాని తో మిడిల్ క్లాస్ అబ్బాయి (MCA) లాంటి విజయాలు తన ఖాతాలో వేసుకుంది, ఆ తర్వాత నాగ శౌర్య తో తీసిన ప్రయోగాత్మక చిత్రం కణం విజయం సాధించక పోయినా కూడా సినిప్రముఖుల ప్రశంసలు పొందింది.
ఇప్పుడు అమ్మడు సరికొత్త పాత్రలో , సరికొత్త లుక్ లో మరోసారి మన ముందుకు రానుంది.తమిళం లో హిట్ అయిన ధనుష్ నటించిన మారి సీక్వెల్ మారి 2లో సాయి పల్లవి ఒక ఆటో డ్రైవర్ గా మనకు కనిపించ బోతుంది, ఈ పాత్ర కోసం తను ఆటో డ్రైవింగ్ కూడా నేర్చుకుంటుంది అంట. మన ముందుకు సంక్రాంతి పండగ కి ఈ సినిమా విడుదల కాబోతుంది. ఈ మధ్యన రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ లో సాయి పల్లవి గాగుల్స్ ధరించి ఆటో డ్రైవర్ ఫోజ్ సినిమా పైన మరింత అంచనాలు పెంచుతున్నాయని సోషల్ మీడియా టాక్ .

Please follow and like us:
0

You may also like...

Leave a Reply

Your email address will not be published.

Enjoy this blog? Please spread the word :)