‘శైలజారెడ్డి అల్లుడు’ సినిమా రివ్యూ

నటీనటులు: అక్కినేని నాగచైతన్య, అను ఇమ్మాన్యుయెల్, రమ్యకృష్ణ, మురళీశర్మ, వెన్నెల కిషోర్, పృథ్వీ ,నరేష్ ,శత్రు తదితరులు
సినిమాటోగ్రఫీ: నిజార్ షఫి
నిర్మాతలు: నాగవంశీ-పీడీవీ ప్రసాద్
రచన – దర్శకత్వం: మారుతి
సంగీతం: గోపీసుందర్

టాలీవుడ్ లో ఒకప్పుడు మంచి హిట్స్ కొట్టిన మూవీస్ లో కొన్ని అత్త మరియు అల్లుడు కాంబోలో వచ్చినవే. హిట్ అవుతున్నాయని అదే పంధాలో తీసిన మరికొన్నిసినిమాలు ఫ్లాప్స్ గానే మిగిలాయి. మళ్ళీ చాలా సంవత్సరాల తరువాత తిరిగి అత్త, అల్లుడు కాంబోలో  ‘sailajareddy alludu’ అనే సినిమాను డైరెక్టర్ మారుతి ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. ఇందులో అక్కినేని నాగచైతన్య, రమ్యకృష్ణ అల్లుడు మరియు అత్త గారి క్యారెక్టర్స్ లో కనిపించారు. నిన్న వినాయకచవితి పండుగ సందర్భంగా ఈ సినిమాని విడుదల చేసారు. ముందుగా రిలేజ్ చేసిన టీజర్స్ తో మంచి రెస్పాన్స్ వచ్చినప్పటికీ మూవీ రిలీజ్ తర్వాత ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకుందో తెలియాలంటే రివ్యూ లోకి వెళ్లి చూద్దాం.
కథ:
కథలోకి వెళ్తే చైతన్య (నాగచైతన్య) ప్రముఖ సాఫ్ట్‌వేర్ కంపెనీ చైర్మన్ రావు గారు పెద్ద ఇగో కలిగిన వ్యక్తి (మురళీశర్మ) ఏకైక పుత్రుడు, తను చెప్పిందే జరగాలనే మనస్తత్వంతో ఉన్న చై తండ్రి కారణంగా చెల్లి పెళ్లి కూడా కాన్సిల్ అవుతుంది. అను (అను ఇమ్మానేయేల్) అనే అమ్మాయిని చూడగానే చైతు ప్రేమిస్తాడు. ఆమె కూడా తండ్రిలానే పెద్ద ఇగో కలిగిన అమ్మాయి. ఇది తెలుసుకున్న చై తండ్రి అను తనలానే ఉండడంతో హఠాత్తుగా అందరి ముందు చైతు, అనుకు నిశ్చితార్థం చేసేస్తాడు. అయితే ఈవిషయం అను తల్లి (శైలజారెడ్డి)కి తెలీకుండా జరగడంతో శైలజారెడ్డి అనుకు వేరే అబ్బాయితో పెళ్లి చేయాలనుకుంటుంది. శైలజారెడ్డి కూడా పెద్ద ఇగోయిస్టు పర్సన్ కావడంతో శైలజారెడ్డి ని ఒప్పించాలని చైతు ఆమె ఇంటికి వస్తాడు. మరి చైతు ఆమెను ఒప్పించాడా ? చివరికి చైతు, అను ఒక్కటయ్యారా..? అనేదే సినిమా.

విశ్లేషణ:
ముగ్గురికి ఒకేలా ఉండే మనస్తత్వం విపరీతమైన ఇగో. వారిలో ఏ ఒక్కరిని బాధపెట్టడకుండా ఓ కుర్రాడు తాను ప్రేమించిన అమ్మాయిని ఎలా పొందాడు అనేది ఈ చిత్ర కథ. దీనిని పూర్తిగా కమర్షియల్ ఎంటర్టైనర్ గా మూవీని తెరకెక్కించాడు మారుతి. పూర్తిగా  ప్రేమకోసం ముగ్గురు వ్యక్తులని మార్చే దానిపైనే స్టోరీ అoతా నడిపించాడు దర్శకుడు మారుతి.  కాని దర్శకుడు మారుతి ఒకరకంగా ప్రేక్షకులను నిరాశపరిచారు అనే చెప్పాలి. ఫస్టాఫ్‌లో ఇగోలు, ప్రేమలు, సెకండాఫ్‌లో శైలజారెడ్డి సామ్రాజ్యాన్ని చూపించారు. ఫస్టాఫ్ ఓకే అయినప్పటికీ సెకండాఫ్‌ను మారుతి ఇంకాస్త బలంగా తీర్చిదిద్ది ఉంటే బాగుండేది. ఇంటర్వల్ తరవాత వెన్నెల కిషోర్, పృథ్వీ కామెడీ తప్ప బలమైన సన్నివేశాలు కనిపించవు. ఇందులో ఆశించినంత హాస్యం కనిపించలేదు. కాదు సెకండాఫ్‌లో వచ్చే ఫైట్‌కు కూడా గోపీ సుందర్ మంచి బీజీఎంను అందించారు. కొత్తగా అనిపిస్తుంది. పాటలు కూడా బాగున్నాయి. క్లైమాక్స్ సన్నివేశాలలో ఎలాంటి కొత్తదనం అన్నది ఏమి కనిపించలేదు.

నటీనటులు:

ఈ sailajareddy alludu నాగచైతన్యకు పెద్ద గుర్తిoపు ఏమి ఉండదు. స్టోరీ అంతా రమ్యకృష్ణ, అనుల చుట్టూనే కథంతా నడుస్తుంది. చైతూ ఇందులో అందంగా స్టైలిష్ గా కనిపించాడు. అతడిలోని కామెడీ యాంగిల్ ఈ సినిమాలో చూడొచ్చు. రమ్య పాత్ర ఆశించిన స్థాయిలో లేకపోయినా సినిమాకు ఎనర్జీ నిచ్చే క్యారెక్టర్. తన యాక్టింగ్ గురించి స్పెషల్ గా చెప్పనవసరం లేదు.. తను అనుకున్నదే జరగాలని, ఎవడైనా తన ముందు తక్కువే అనే భావనతో పొగరబోతు అమ్మాయిలా అను ఇమ్మానుయేల్ ఆకట్టుకుంది. వెన్నెల కిషోర్ సినిమా అంతటా కనిపించే రోల్ చేశాడు కానీ కామెడీ అతడి స్థాయికి తగ్గ స్థాయిలో లేదు. పృథ్వీ కొన్ని చోట్ల నవ్వించాడు. నరేష్ ఓకే. మురళీ శర్మ ఇగోను తలకెక్కించుకున్న పాత్రలో జీవించేశారు.

సాంకేతిక విభాగం :

దర్శకుడు మారుతీ కామెడీ పెద్దగా లేకపోయినా కథనంతో ప్రేక్షకులను రీచ్ అవడానికి ప్రయత్నం చేశాడు. నిజార్ షఫీ అందించిన సినిమాటోగ్రఫీ సినిమాకు హైలైట్ గా నిలిచింది.గోపిసుందర్ అందించిన సంగీతం బాగుంది. మంచి పాటలతో పాటు అదిరిపోయే బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అందించారు. ముఖ్యంగా యాక్షన్ సన్నివేశాల్లో బీజీఎం కొత్తగా ఉంది. కోటగిరి వెంకటేశ్వరరావు అందించిన ఎడిటింగ్ బాగుంది. సితార ఎంటర్ టైన్మెంట్స్ నిర్మాణ విలువలు చాలా బాగున్నాయి. సినిమాను చాలా రిచ్‌గా చూపించారు.

 ప్లస్ పాయింట్స్ :

నాగచైతన్య, రమ్యకృష్ణ, అను ఇమ్మాన్యుయేల్ యాక్టింగ్

మారుతి డైరెక్షన్

వెన్నెల కిషోర్, ఫృథ్వీ కామెడీ

సితార ఎంటర్‌టైన్‌మెంట్ ప్రొడక్షన్ వ్యాల్యూస్

మైనస్ పాయింట్స్ :

రొటీన్ స్టోరి

ప్రీ క్లైమాక్స్ లో కొంత స్లో నేరేషన్

కామెడీ ఎక్కువగా లేకపోవడం

తీర్పు:
ఇది కంప్లీట్ కమర్షియల్ ఎంటర్టైనర్ సినిమా. మొత్తం మీద ‘శైలజారెడ్డి అల్లుడు’ కొంతవరకు బాగానే ప్రేక్షుకులను ఎంటర్టైన్ చేస్తుంది. మరి అన్ని వర్గాల ప్రేక్షకులకు ఈ చిత్రం ఎంతవరకు కనెక్ట్ అవుతుందో చూడాలి.

 

Please follow and like us:
0

You may also like...

Leave a Reply

Your email address will not be published.

Enjoy this blog? Please spread the word :)