ఫ్లాప్ దర్శకుడితోనే ధరం తేజ్ మరో ప్రయత్నం?

చిరంజీవి పోలికలతో, మెగా కుటుంబం అండతో సినిమాల్లోకి వచ్చిన మెగా మేనల్లుడు సాయి ధరం తేజ్. ఈయనకు కెరీర్ మొదట్లో కొద్దో గొప్పో విజయం లభించినా ఆ తరువాత పెద్దగా కలిసి రావట్లేదు. రకుల్ వంటి పెద్ద హీరోయిన్ తో ‘విన్నర్’ చేసినా ఫలితం శూన్యం. తాజాగా ‘ఇంటెలిజెంట్’ మరియు ‘తేజ్ ఐ లవ్ యు’ సినిమాలు కూడా నిరాశనే మిగిల్చాయి.

ఈ తరుణంలో సాయి ధరం తేజ్ ఏమీ డీలా పడలేదు. చేతిలో రెండు సినిమాలతో సెట్స్ లో తీరిక లేకుండా ఉన్నాడు. అయితే తాజాగా ఆయన మరో సినిమా అంగీకరించాడు. అది కూడా ‘విన్నర్’ సినిమా చేసిన గోపిచంద్ మలినేని దర్శకత్వంలో. రచయిత సాయి మాధవ్ బుర్రా ‘కంచె’ వంటి సినిమాలకు మాటలoదించి ప్రశంసలు అందుకున్నాడు. అటువంటి రచయిత సాయి ధరం తేజ్ కోసం ఒక పక్కా కమర్షియల్ కధ సిద్ధం చేసాడని సమాచారం. కధ సరే, మళ్ళీ అదే పాత కలయికలో సినిమా చేయడానికి సాయి ధరం తేజ్ ఎలా అంగీకరించాడో వేచి చూడాలి.

Please follow and like us:
0

You may also like...

Leave a Reply

Your email address will not be published.

Enjoy this blog? Please spread the word :)