సాక్ష్యం మూవీ రివ్యూ

నటీనటులు: సాయి శ్రీనివాస్, పూజా హెగ్డే, జగపతిబాబు, మీనా, శరత్ కుమార్, పవిత్ర లోకేష్, జయప్రకాష్, రవికిషన్, అశుతోష్ రాణా తదితరులు

సంగీతం: హర్షవర్ధన్ రామేశ్వర్

సినిమాటోగ్రఫి: అర్థర్ విల్సన్

ఎడిటింగ్: కోటగిరి వెంకటేశ్వరరావు

దర్శకుడు: శ్రీవాస్

నిర్మాతలు: అభిషేక్ నామా

జానర్: యాక్షన్, డ్రామా

ఈ మధ్యకాలంలో వస్తున్న సినిమాలని కొంచెం కొత్తతరహాలో చూపించేలా దర్శకులు కొత్త కొత్త కాన్సెప్ట్స్ ని ఎంచుకుంటున్నారు. మంచి కధ, ఆకట్టుకునే కధనం ఉంటే చాలు ప్రేక్షకుల అంచనాలను అందుకున్నట్టే . ఇప్పుడు దర్శకుడు శ్రీవాస్ కూడా ఇదే ట్రెండ్ ఫాలో అయ్యి ఇదివరకు ఎవరు ట్రై చేయని ఒక కొత్త కాన్సెప్ట్ పంచభూతాలను ‘సాక్ష్యం’గా చేసుకుని సినిమాను తెరకెక్కించారు. మరి ఈ సినిమాతో బెల్లంకొండ శ్రీనివాస్ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టినట్టేనా, సినిమా ప్రేక్షకుల అంచనాలను అందుకుందా? నిర్మాతలకు కాసుల వర్షం కురిపిస్తుందా? మరి ఇవన్నీ తెలియాలంటే కొద్దిరోజులు వేచి చూడాల్సిందే. ఈ లోపు అసలు ఈ సాక్ష్యం కథ ఏంటో చూద్దాం
కథ :
విశ్వజ్ఞ (బెల్లంకొండ శ్రీనివాస్ ఒక వీడియో గేమ్ డెవలపర్. అమెరికాలో సెటిల్ అయిన బిజినెస్ మ్యాన్ శివ ప్రకాశ్ (జయప్రకాశ్) పెంపుడు కుమారుడు. అక్కడే ప్రవచనాలు చెప్పే సౌందర్య లహరి (పూజా హెగ్డే)తో ప్రేమలో పడుతాడు. ఓ చిన్న కారణంగా వీరిద్దరూ విడిపోతారు. తనకు చెప్పకుండా ఇండియాకు వచ్చిన తన లవర్ కోసం అతను ఇండియా వస్తాడు. అక్కడే అక్రమాలకు, అన్యాయానికి పాల్పడే దుష్టులు (జగపతిబాబు, అశుతోష్ రాణా, రవి కిషన్, మధు గురుస్వామి, కబీర్) ఒక్కొక్కరిని కారణం తెలియకుండా పంచభూతాల సహాయంతో చంపేస్తుంటాడు. ట్విస్ట్ ఏంటి అంటే చిన్నతనంలోనే మునిస్వామి (జగపతిబాబు) తన తల్లిదండ్రుల (శరత్ కుమార్, మీనా)ను, మొత్తం ఫ్యామిలీని చంపేస్తాడు. కానీ ఆ విషయం విశ్వజ్ఞ‌కు తెలియదు. అయితే వారి హత్యలకు ఓ సాక్ష్యం మిగులుతుంది. తన తల్లిదండ్రులను మునిస్వామి ఎందుకు చంపాడు? తన కుటుంబాన్ని చంపిన వారిపై ఎలా ప్రతీకారం తీర్చుకొన్నాడు? ఈ క్రమంలో పంచభూతాలు అతనికి ఎలా సహాయపడ్డాయి? తాను డిజైన్ చేసిన వీడియో గేమ్‌లోని ఇన్సిడెంట్స్ లాగే హత్యలు ఎలా జరిగాయి? తన లవ్ ని గెలుచుకున్నాడా? అనే ప్రశ్నలకు సమాధానమే సాక్ష్యం చిత్ర కథ.

విశ్లేషణ:
దర్శకుడు శ్రీవాస్ ఎంచుకున్న కాన్సెప్ట్ అద్భుతంగా ఉంది. డైరెక్టర్ టేకింగ్ పంచభూతాలను సాక్ష్యంగా చేసి కథను నడిపించిన తీరు రియల్లీ నైస్. కథ చాలా బాగున్నప్పటికీ దాన్ని తెరపై చూపించడంలో దర్శకుడు ప్రేక్షకుల అంచనాలను  చేరుకోలేదనే చెప్పాలి.
సినిమా బాగా సాగదీశారనే భావన కలుగుతోంది. ముఖ్యంగా ఫస్ట్ హాఫ్‌ లో ఎంటర్‌టైనింగ్ సీన్స్ మరికొన్ని ఉంటే బాగుండేది. సౌందర్య లహరి(పూజా హెగ్డే) ప్రేమ కోసం హీరో పడే పాట్లు, వెన్నెల కిషోర్ కామెడీ సీన్స్ బాగున్నాయి. ఫస్ట్ హాఫ్ లో లవ్ స్టోరీ సెకండ్ హాఫ్ లో రివెంజ్ స్టోరీ యాక్షన్ సీన్స్ కి మాత్రం ఏ మాత్రం కొదువలేదు. యాక్షన్ సన్నివేశాలు మూవీలో హైలెట్ గా నిలుస్తాయి. పాటలు కథానుగుణంగా ఒక్కటి ఉండదు. కానీ సినిమా మొత్తాన్ని ‘శివం శివం భవ హరం హరం’ అనే బ్యాక్ గ్రౌండ్ సాంగ్ నడిపించింది.

సెకండాఫ్‌‌లో విలన్స్ ను ఎదుర్కోవడం మాత్రం చాలా ఆసక్తికరంగా తెరకెక్కించారు. వీడియో గేమ్‌ కోసం వాల్మీకి(గేయ రచయిత అనంత్ శ్రీరామ్) తయారుచేసిన కాన్సెప్ట్ లో మాదిరిగానే హీరో శత్రువులను చంపడం ఆసక్తికరంగా ఉంటుంది.
టెక్నికల్ వాల్యూస్ విషయానికి వస్తే:
సినిమా చాలా రిచ్‌గా ఉంది. నిర్మాణ విలువలు చాలా బాగున్నాయి. ఆర్థర్ ఎ. విల్సన్ సినిమాటోగ్రఫీ అద్భుతంగా ఉంది. హర్షవర్ధన్ రామేశ్వర్ అద్భుతమైన బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ అందించారు.బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఈ మూవీకి హైలైట్ అని చెప్పాలి. హై టెక్నికల్ వాల్యూస్ తో తీసిన యాక్షన్ సన్నివేశాలు సినిమాలో మరో ముఖ్యమైన విషయం.

నటన పరంగా:
బెల్లంకొండ శ్రీనివాస్ తన పాత్రకు వంద శాతం న్యాయం చేసాడనే చెప్పాలి. ఫైట్లు, డ్యాన్సులలో ది బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. ఇక పూజా హెగ్డే ఎప్పటిలానే బాగానే నటించింది. సౌందర్యలహరి పాత్రలో అందంగా కనిపించింది. పర్ఫార్మేన్స్ కి పెద్దగా స్కోప్ లేకపోయిన తన పరిధి వరకు బాగా నటించింది. విలనిజంలో జగపతిబాబు తర్వాతే ఎవరైనా అన్నట్టు మునిస్వామి పాత్రలో నటించాడు. ఆయన తమ్ముళ్లుగా రవి కిషన్, అశుతోష్ రాణా, మధు గురుస్వామి బాగా నటించారు. మీనా, శరత్ కుమార్ లు అతిధి పాత్రల్లో కనిపిస్తారు. అనంత్ శ్రీరామ్, వెన్నెల, రావు రమేష్, జయప్రకాష్, పవిత్ర లోకేష్, పోసాని, కాశీ విశ్వనాథ్ తమ పాత్రల పరిధి మేరకు అద్భుతంగా  నటించారు.

ప్లస్ పాయింట్స్:

బెల్లంకొండ శ్రీనివాస్ నటన

బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్

సినిమాటోగ్రఫీ

మైనస్ పాయింట్స్:

అనవసరమైన పాటలు

కథలో సాగతీత

మొత్తంగా సాక్ష్యం మూవీ ఒక కమర్షియల్ ఎంటర్టైనర్. మాస్ ప్రేక్షకులకి ఒక పండగ అనే చెప్పాలి. ఒకసారి థియేటర్‌కు వెళ్లి ఎంజాయ్ చెయ్యొచ్చు.

 

Please follow and like us:
0

You may also like...

Leave a Reply

Your email address will not be published.

Enjoy this blog? Please spread the word :)