Tollywood news in telugu

అక్టోబ‌ర్ 11న విడుద‌ల‌వుతున్న పాయల్ రాజ్‌పుత్‌ `RDX  ల‌వ్‌`

అక్టోబ‌ర్ 11న విడుద‌ల‌వుతున్న పాయల్ రాజ్‌పుత్‌ `RDX  ల‌వ్‌`

`RX 100` ఫేమ్ పాయ‌ల్ రాజ్‌పుత్‌, తేజస్ కంచ‌ర్ల ప్ర‌ధాన పాత్ర‌ధారులుగా శంక‌ర్ భాను ద‌ర్శ‌క‌త్వంలో రామ్ మునీష్ సమర్ప‌కుడిగా హ్యపీ మూవీస్ బ్యానర్‌పై సి.కల్యాణ్ నిర్మిస్తోన్న‌ చిత్రం `RDX  ల‌వ్‌`. ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు జ‌రుగుతున్నాయి. అన్ని కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసి సినిమాను అక్టోబ‌ర్ 11న విడుద‌ల చేస్తున్నారు ద‌ర్శ‌క నిర్మాత‌లు.
ఇటీవ‌ల విడుద‌లైన టీజ‌ర్‌కు అమేజింగ్ రెస్పాన్స్ వ‌చ్చింది. ఈ ట్రైల‌ర్‌లోని యాక్ష‌న్ స‌న్నివేశాలు, డైలాగ్స్‌తో పాయ‌ల్ ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకున్నారు. అలాగే టీజ‌ర్‌, పోస్ట‌ర్స్‌కు చాలా మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. సినిమాపై భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి. న‌రేశ్‌, నాగినీడు, తుల‌సి, ఆమ‌ని త‌దిత‌రులు ఇత‌ర కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. ర‌ధ‌న్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి సి.రాంప్ర‌సాద్ సినిమాటోగ్ర‌ఫీ అందిస్తున్నారు.

నటీనటులు:
పాయల్ రాజ్‌పుత్, తేజస్ కంచెర్ల, వి.కె.నరేశ్, ఆదిత్య మీనన్, నాగినీడు, తులసి, ఆమని, ముమైత్ ఖాన్, విద్యుల్లేఖా రామన్, సత్య శ్రీ, సాహితీ, దేవిశ్రీ, జోయా మీర్జా తదితరులు

సాంకేతిక వర్గం:
కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: శంకర్ భాను
నిర్మాత: సి.కల్యాణ్
కో ప్రొడ్యూసర్: సి.వి.రావు
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: చిన్నా
మ్యూజిక్: రధన్
సినిమాటోగ్రఫీ: సి.రాంప్రసాద్
ఎడిటర్: ప్రవీణ్ పూడి
డైలాగ్స్: పరుశురాం
ఫైట్స్: నందు
కొరియోగ్రఫీ: గణేశ్ స్వామి
పి.ఆర్.ఒ: వంశీ శేఖర్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button