ఓ బేబీ మహిళల కోసం రూపొందించబడింది – రానా


స‌మంత అక్కినేని, ల‌క్ష్మి, నాగ‌శౌర్య‌, రావు ర‌మేష్‌, రాజేంద్ర‌ప్ర‌సాద్ ప్ర‌ధాన తారాగ‌ణంగా బి.వి.నందినీ రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో సురేష్ ప్రొడ‌క్ష‌న్స్‌, గురు ఫిలింస్, పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ, క్రాస్ పిక్చ‌ర్స్ ప‌తాకాల‌పై తెర‌కెక్కిన చిత్రం ఓ బేబీ. సురేష్ బాబు, సునీత తాటి, టి.జి.విశ్వప్ర‌సాద్‌, హ్యున్ హు, థామ‌స్ కిమ్ నిర్మాత‌లు. ఈ చిత్ర సక్సెస్ మీట్ ఆదివారం జరిగింది. రానా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

ఈ సందర్బంగా రానా మాట్లాడుతూ…

‘ఓ బేబీ’ సినిమా ఎంత పెద్ద హిట్టయిదో చెప్పక్కర్లేదు. నేను వీకెండ్స్ సమయంలో డిస్ట్రిబ్యూషన్ ఆఫీసులకు ఫోన్ చేసి కలెక్షన్లు కనుక్కుంటూ ఉంటాను. వాళ్లు నెంబర్లు చెబుతున్నపుడు… సాధారణంగా మీ బేనర్ నుంచి వచ్చే సినిమాల కంటే చాలా బాగా ఆడుతుంది. మా నాన్న కోరిక నేను సంవత్సరానికి మూడు సినిమాలు చేయాలని, అంత టాలెంట్ అయితే నాకు లేదు. నాకు ఒక సినిమా మూడు సంవత్సరాలు పట్టేస్తుంది. సమంత.. నీ పిచ్చకు ఒక అడ్డస్ దొరికేసింది. నువ్వు ఎన్ని సినిమాలు కవాలంటే అన్ని సినిమాలు ఇక్కడ చేసుకోవచ్చు.ఈ సినిమా మహిళలచే రూపొందించబడింది. మహిళల గురించి, వారి ఎమోషన్స్ గురించి చర్చించే సినిమా. అది కూడా మగాళ్ల మసును హత్తుకునే విధంగా… ఇలాంటి ఒక స్పెషల్ సినిమా తెలుగువారు ఆదరించారు. ఒక కొరియన్ కథను తెలుగు నేటివిటీకి తగిన విధంగా చేసిన నందినీ రెడ్డికి హాట్సాఫ్. అంటూ రానా ప్రశంశల జల్లులు కురిపించారు.

Please follow and like us:
0

You may also like...

Leave a Reply

Your email address will not be published.

Enjoy this blog? Please spread the word :)