నేడు భగవాన్ రమణుల జయంతి

ఈరోజు భగవాన్ రమణమహర్షి యొక్క జన్మదిన ఉత్సవం

భారతదేశ చరిత్రలో 20వ శతాబ్దంలో కూడా ప్రపంచ ఖ్యాతిని పొందిన జ్ణాని భగవాన్ రమణ మహర్షి తమిళనాడు తిరుచ్చెలీ లో 1879లో జన్మించారు.బాల్యాన్ని అందరిలాగా సాధారణంగా గడిపిన ఈయన ఒక్కసారి అరుణాచల క్షేత్రం యొక్క పేరును వాళ్ల పెదనాన్న గారి మాటల్లో విన్న ఆయన ఇక అక్కడ నుండి అరుణగిరి వెళ్లి అక్కడ భూగర్భ మందిరంలో ధ్యానంలో నిమగ్నమయ్యారు.మౌనం తన భాషగా తన దగ్గరికి వచ్చే శిష్యులకు సమాధానాలు ఇచ్చేవారు.

తన మౌనం అర్ధంగాని భక్తులకు మాత్రం మాటలతో ఎంత కఠినమైన సమస్య అయినా విశదీకరించి చెప్పేవారు.ఒక జర్నలిస్టు రాసిన ఆంగ్ల కథనం ఆయన్ని అంతర్జాతీయము గా ప్రచారం చేసింది.గాంధీ లాంటి వ్యక్తులు కూడా ఆయనకు భక్తులు.

ఆర్ద్రా నక్షత్రం లో పుట్టిన ఆయన దక్షిణామూర్తి స్వరూపం అని,కేవలం కౌపీనం మాత్రమే అనగా గోచీ గుడ్డ మాత్రమే ఆయన వస్త్రాలు గా ధరిస్తారు కాబట్టి ఆయన్ని కుమారస్వామి స్వరూపం అని కొలిచేవారు.పశు పక్ష్యాదులతో కూడా ఆయన సఖ్యతతో మెదిలే వారు.అలాంటి వారికి కావ్య కంఠగణపతి ముని కూడా శిష్యుడు.ఇళయరాజా లాంటి సంగీత దర్శకులు ఆయన్ని ,ఆయన భోధనలు అనుసరిస్తూ ఉన్నారు.ఈరోజు వీలయితే ఆయన సందేశాలు కొన్నైనా చదివి పునీతమవండి.
ఓం నమో భగవతే రమణాయ

Please follow and like us:
0

You may also like...

Leave a Reply

Your email address will not be published.

Enjoy this blog? Please spread the word :)