అనుపమ…ప్రేమ కోసమే అంటున్న రామ్

టాలీవుడ్ లో దేవదాన్ సినిమాతో హీరోగా తెరోగేట్రo చేసిన ఎన‌ర్జిటిక్ స్టార్ రామ్ ఉన్నది ఒక్కటే జిందగీ మూవీ తరువాత నటిస్తున్న చిత్రం “హ‌లో గురు ప్రేమ కోస‌మే”. ఎన్నో హిట్ చిత్రాలను అందించిన శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై నిర్మాత దిల్‌రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు.  ఇది ఒక రొమాంటిక్ ల‌వ్ ఎంట‌ర్ టైన‌ర్. ram సరసన అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్, ప్ర‌ణీత హీరోయిన్స్ గా న‌టిస్తున్నారు. సినిమా చూపిస్త మావ‌, నేను లోక‌ల్ వంటి హిట్ చిత్రాల ద‌ర్శ‌కుడు త్రినాథ‌రావు న‌క్కిన ద‌ర్శ‌క‌త్వంలో ఈ చిత్రం రూపొందుతోంది. విల‌క్ష‌ణ న‌టుడు ప్ర‌కాశ్‌రాజ్ ఇందులో కీల‌క‌పాత్ర‌లో న‌టిస్తున్నారు. ఎన్నో సూప‌ర్‌హిట్ చిత్రాల‌కు త‌న‌దైన సంగీతాన్ని అందించిన దేవిశ్రీ ప్ర‌సాద్ ఈ మూవీకి సంగీతాన్ని అందిస్తున్నారు. విజ‌య్ కె.చ‌క్ర‌వ‌ర్తి సినిమాటోగ్ర‌ఫీ, సాహి సురేశ్ ఆర్ట్ వ‌ర్క్‌, కార్తీక శ్రీనివాస్ ఎడిటింగ్ వ‌ర్క్ అందిస్తున్నారు. బెజ‌వాడ ప్ర‌స‌న్న‌కుమార్ మాట‌లు, ర‌చ‌న స‌హ‌కారం సాయికృష్ణ అందిస్తున్నారు. ఈ సినిమా టాకీ పార్ట్ పూర్త‌య్యింది. అన్ని కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసి సినిమాను ద‌స‌రా సంద‌ర్భంగా అక్టోబ‌ర్ 18న విడుద‌ల చేయాల‌ని చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోంది.

సినిమా టైటిల్ ని చూస్తేనే ఇది యూత్ కి కనెక్ట్ అయ్యే ఒక మంచి లవ్ ట్రాక్ ఉoటుందని తెలుస్తుంది. తను ప్రేమించిన అమ్మాయి కోసం ఓ కాలేజీ చుట్టూ తిరిగే కుర్రాడిగా ram ఈ సినిమాలో మనకు కనిపించబోతున్నాడు. ఈ చిత్రంలో అనుపమా పరమేశ్వరన్ ఇంజనీరింగ్ విద్యార్థినిగా నటిస్తోంది. ప్రస్తుతం సినిమాలో కీలకమైన కాలేజీ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. రాత్రివేళల సీన్స్ ఉన్నాయట. ram కూడా ఈ మూవీలో ఒక స్టైలిష్ లుక్ లో కనిపిస్తున్నాడు. ఇక రామ్, అనుపమ ఇందులో బావ, మరదలుగా, హీరోకి మామయ్య పాత్రలో ప్రకాశ్ రాజ్ నటిస్తున్నారు.  ప్రకాష్ రాజ్ కి రామ్ కి మధ్య వచ్చే సన్నివేశాలు ప్రేక్షకులను చాలా బాగా అలరిస్తాయని చిత్ర యూనిట్  నమ్మకంగా ఉంది.

ఈ సందర్భంగా చిత్రయూనిట్ మొత్తం ఓ గ్రూప్ ఫోటో దిగి సోషల్ మీడియాలో షేర్ చేశారు.

Please follow and like us:
0

You may also like...

Leave a Reply

Your email address will not be published.

Enjoy this blog? Please spread the word :)