ఎన్టీఆర్ బయోపిక్ లో రకుల్ పాత్ర ఏంటంటే…

ప్రస్తుతం టాలీవుడ్ లో అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్న ప్రాజెక్ట్ ‘ఎన్టీఆర్’ బయోపిక్. ప్రకటించిన నాటి నుండే ప్రొడక్షన్ దశలోనే అనేక మలుపులు తిరుగుతోందీ సినిమా. ముందుగా సినిమా దర్శకత్వ బాధ్యత తీసుకున్న తేజ ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నాక బాలకృష్ణ ఆ బాధ్యతను దర్శకుడు క్రిష్ కు అప్పగించాడు. ఇప్పటికే ఇందుకో అనేక మంది ప్రముఖులు నటిస్తున్నారు. సినిమాకి సంబంధించిన అన్ని విషయాల్లో బాలకృష్ణ చురుగ్గా పాల్గొంటున్నారు. అలాగే చాలా ప్రతిష్టాత్మకంగా ఈ సినిమా నిర్మిస్తున్నారు బాలకృష్ణ.

ఈ సినిమాలో ఇప్పటికే మోహన్ బాబు, రాణా, కీర్తి సురేష్ నటిస్తున్నారు. కాగా రకుల్ ప్రీత్ కూడా ఈ సినిమాలో ‘శ్రీదేవి’ పాత్రలో నటించనుందట. ఎన్టీఆర్ జీవితం సినిమా ఆధారంగా ఉంటుంది కాబట్టి సావిత్రి పాత్రకి కీర్తి సురేష్, శ్రీదేవి పాత్రకి రకుల్ ను ఖరారు చేసారట. మొత్తానికి ఈ సినిమా మొదటి నుంచే జనాల్లో ఆసక్తిని రేకెత్తించింది, ఇప్పుడు ఈ తారాగణం ఆ ఆసక్తిని మరో మెట్టు ఎక్కించారు అనడంలో సందేహం లేదు కదూ.ul

Please follow and like us:
0

You may also like...

Leave a Reply

Your email address will not be published.

Enjoy this blog? Please spread the word :)