Tollywood news in telugu

‘నమ్మేలా లేదే’ అంటున్న ‘రాజావారు రాణిగారు’ 


ఈ మధ్యకాలంలో సోషల్ మీడియా లో బాగా హైలైట్ అయిన పేరు ‘రాజావారు రాణిగారు‘.పోస్టర్లతో టీజర్ తో జనాలలో మంచి ఆసక్తి రేకెత్తించిన ఈ చిత్రం గతవారమే మొదటి పాట ద్వారా ప్రజలకు మరింత చేరువైంది.రాజావారు రాణిగారు టైటిల్ సాంగ్ కు విశేషమైన స్పందన రావడంతో చిత్రబృందం ఈ సినిమా లోని రెండో పాటని కూడా విడుదల చేసారు.
జయ్ క్రిష్ సంగీత సారథ్యంలో రూపొందిన ‘నమ్మేలా లేదే ..’ అనే ఈ మెలోడీ కి కూడా నెటిజన్ల నుంచి మంచి స్పందన లభిస్తోంది.ముఖ్యంగా యూత్ ఈ పాటకి కనెక్ట్ అయ్యే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. అనురాగ్ కులకర్ణి గాత్రం ఈ పాటకు మరింత అందాన్ని తీసుకొచ్చింది. ‘నమ్మేలా లేదే..కల కాదే.. మనసే మేఘమాయే’ అంటూ సాగే ఈ పాట సాహిత్యపరంగా కూడా చాలా బావుండటం కలిసొచ్చే అంశం.
.
ఈ చిత్రంతో కిరణ్ అబ్బవరం,రహస్య గోరఖ్ లు హీరో హీరోయిన్స్ గా పరిచయం అవుతున్నారు.
ఈ చిత్రానికి రవికిరణ్ కోలా దర్శకత్వం వహిస్తుండగా, ఎస్ ఎల్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై మనోవికాస్ నిర్మిస్తున్నారు.
ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు పూర్తి చేసుకుంటున్న ఈ చిత్రాన్ని సెప్టెంబర్ లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

Cast : Kiran Abbavaram, Rahasya Gorak, Rajkumar Kasireddy, Yazurved Gurram, Snehamadhuri Sharma, Divya Narni
Written and Directed by : Ravi Kiran Kola
Production house : SL Entertainments
Producer : Manovikas D
Music : Jay Krish
Cinematography : Vidyasagar Chinta, Amardeep Guttula
Editing : Viplav Nyshadam
Sound Design : Sync Cinema
Sound Mixing : Aravind Menon
DI : Suresh Ravi
Lyrics : Sanapati Bharadwaj Patrudu, Rakendu Mouli
Direction Team : Prem Kishore – Pradeep Varada – Bharat Rongali – Mahhadh – Shyam – Venkat P.Shetty
Production team : Nanda Lokasani – Marripalem Vinesh Sai Santosh – Challapalli Vishal – Satish Varaputra – Mohan – M. Krupa Roy
Publicity Designs : Dhani Aelay
Digital Media : Sai Prakash – Vineeth Babu
PRO : Eluru Sreenu

here song link…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button