‘రాజావారు రాణిగారు’ టీజర్ విడుదల !


ఎస్ఎల్ ఎంట‌ర్‌టైన్మెంట్స్ బ్యాన‌ర్‌పై డి. మ‌నోవికాస్ నిర్మిస్తున్న చిత్రం ‘రాజావారు రాణిగారు’. ర‌వికిర‌ణ్ ద‌ర్శ‌కత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో కిర‌ణ్ అబ్బావ‌ర‌మ్‌, ర‌హ‌స్య‌గోర‌క్ హీరోహీరోయిన్లుగా న‌టిస్తున్నారు. ఈ చిత్ర టీజ‌ర్‌ను సోమ‌వారం హైదరాబాద్ ప్ర‌సాద్‌ల్యాబ్స్‌లో విడుదల చేశారు.

ఈ కార్యక్రమంలో ప్రొడ్యూస‌ర్ డి. మ‌నోవికాస్ మాట్లాడుతూ.. ఇదొక మంచి ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్‌ మూవీ. డైరెక్ట‌ర్ ర‌వి కూడా ఈ సినిమా కోసం చాలా క‌ష్ట‌ప‌డ్డారు. సెట్స్‌లో ఏ ప్రాబ్ల‌మ్ లేకుండా చాలా చ‌క్క‌గా అవుట్‌పుట్ ఇచ్చారు. క‌థ విన్నాక బాగా న‌చ్చి నేనే ప్రొడ్యూస్ చేశాను. హీరో కూడా చాలా బాగా చేశారు. హీరోయిన్ కూడా బాగా క‌ష్ట‌ప‌డింది. నాకు ఈ సినిమాతో ఒక మంచి సిస్ట‌ర్‌లా అయిపోయింది. సినిమా యూనిట్ అంతా ఎంతగానో సహకరించారని తెలిపారు.

హీరోయిన్ ర‌హ‌స్య‌గోర‌క్ మాట్లాడుతూ.. ‘‘నా పేరు ర‌హ‌స్య‌. నాకు ఇంత మంచి క్యారెక్ట‌ర్ ఇచ్చిన ప్రొడ్యూస‌ర్, డైరెక్ట‌ర్ల‌కు నా ప్ర‌త్యేక కృత‌జ్ఞ‌త‌లు. సినిమా చాలా బాగుంటుంది. మీ అంద‌రికీ త‌ప్ప‌కుండా న‌చ్చుతుంది..’’ అన్నారు.

ద‌ర్శ‌కుడు ర‌వి మాట్లాడుతూ.. మీ అంద‌రికీ టీజ‌ర్ బాగా న‌చ్చింది అనుకుంటున్నాను. ఈ మూవీ మీ అంద‌రికి ఒక ఫ్రెష్ అనుభ‌వాన్ని ఇస్తుందని తెలిపారు.

హీరో మాట్లాడుతూ.. ఇంత‌కు ముందు నేను రెండు వెబ్‌సిరీస్‌‌లలో చేశాను. అప్పుడు కొంచం టెన్షన్ ఉండేది కానీ ఇప్పుడు అది లేదు. మాకు ఇంత మంచి స‌పోర్ట్ ఇస్తున్న ప్ర‌తి ఒక్క‌రికీ చాలా థ్యాంక్స్‌. ఈ సినిమా రెండు, మూడు నెల‌ల్లో విడుద‌ల‌వుతుంది. మూవీ చాలా బాగా వ‌చ్చింది. టీమ్ అంద‌రం బాగా హ్యాపీగా ఉన్నాం. ఈ సినిమా ఇంత బాగా రావ‌డానికి ముఖ్య కార‌ణం మా ప్రొడ్యూస‌ర్‌గారి ఫాద‌ర్. ఆయ‌న చాలా మంచి స‌పోర్ట్ ఇచ్చారు. ఆయనకు నా ధన్యవాదాలు.. అని అన్నారు.

ప్రొడ్యూస‌ర్ తండ్రి యాద‌గిరి మాట్లాడుతూ.. ‘‘మా అబ్బాయి ముగ్గురు ఫ్రెండ్స్‌తో క‌లిసి సినిమా తీస్తున్నాం అన్నాడు. వాడి ఇంట్ర‌స్ట్ చూసి ఒప్పుకున్నాను. అన్న మాట ప్ర‌కారం ర‌వి సినిమా చాలా బాగా తీశాడు. నా న‌మ్మ‌కాన్ని ఒమ్ముచేయ‌లేదు. సినిమా చాలా బాగా వ‌చ్చింది. మా అబ్బాయికి సహకరించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు..’’ అని అన్నారు.

Please follow and like us:
0

You may also like...

Leave a Reply

Your email address will not be published.

Enjoy this blog? Please spread the word :)