బాగా స్ట్రెస్ ఫీల్ అవుతున్నారా?? అయితే మీకు తప్పక ఇది వచ్చే ప్రమాదముంది

సాధారణంగా ఈ బిజీ లైఫ్త లో పని ఒత్తిడి వల్ల ఎక్కువ స్ట్రెస్ల ఫీల్ అవుతుంటారు. అయితే ఈ స్ట్రెస్ అనే దానికి చాలా కారణాలు ఉండొచ్చు. ఈ స్ట్రెస్ వల్ల హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా ఎక్కువే.  వీటిలో మైగ్రేన్  అనేది ఎక్కువగా చూస్తుంటాము. తలనొప్పి అనేది  జీవితంలో ప్రతిఒక్కరికి ఏదో ఒక సందర్భంలో వచ్చే ఉంటుంది. కాని మైగ్రేన్ లేదా తీవ్ర తలనొప్పి అనేది మాత్రం కొంతమందిని మాత్రమే రెగ్యులర్ గా ఇబ్బంది పెడుతుంటుంది. మరొక మాటలో చెప్పాలంటే మీ జీవితం నుండి శాంతి మరియు ప్రశాంతతను కోల్పోయినట్టే. ఇది ఒక జన్యుపరమైన డిసార్డర్ అయినప్పటికీ, మన చుట్టూ ఉన్న జీవనశైలి, ఆహారం మరియు హార్మోన్స్ ఇoబాలన్స్ మొదలైనవన్నీ కూడా మీరు ఎంత తరచుగా మైగ్రేన్ తో బాధపడుతున్నారు అనే దానిపై మేజర్ రోల్ ని పోషిస్తాయి. మైగ్రేన్ తో బాధపడుతున్న వ్యక్తులు పూర్తిగా ఆ సమయాల్లో అలసిపోయి ఉంటారు. దీనినే ఫాటిగ్ అని కూడా అంటారు. ఈ తీవ్రమైన అలసట వల్ల తలనొప్పి ఒకటి లేదా రెండు వైపులా తరచుగా కనిపిస్తుంది. తీవ్రమైన సందర్భాల్లో, ఈ మైగ్రేన్ తో బాధపడేవారు వికారం, వాంతులు, ఎక్కువగా సౌండ్స్, లైట్స్ ని తట్టుకోలేకపోవడం మరియు వారి కళ్ళ మీద కూడా ఎక్కువగా ఒత్తిడిని ఎదుర్కొంటారు.

నైట్రేట్స్ లేదా మోనోసోడియం గ్లుటామాట్ (MSG) లు అధిక మొత్తంలో ప్రాసెస్ చేయబడిన ఆహారాలు మరియు చాలా ఎక్కువగా మద్యం తీసుకోవడం వలన maigrane ఏర్పడవచ్చు.”ఈ మైగ్రైన్ అనేది ముఖ్యంగా అడల్ట్స్ మరియు పిల్లలలో సాధారణoగా కనిపించే డిసార్డర్ మరియు మహిళలో ఇది మరీ ఎక్కువగా ప్రభావాన్ని చూపిస్తుంది. ఈ మైగ్రేన్ అనేది తలపై మధ్యస్థం నుండి తీవ్రమైన స్థాయిలో దాని తీవ్రతను చూపిస్తుంది, అది మైగ్రెయిన్ యొక్క సాధారణ లక్షణం. ఇది సాధారణమైన శారీరక శ్రమ ద్వారా తీవ్రతరం మరియు వికారం, వాంతులు, ఫోటో ఫోబియాతో లేదా ఫోనోఫోబియాతో ముడిపడివున్న నాలుగు లేదా 72 గంటలు, మితమైన లేదా తీవ్రమైన తీవ్రతతో కొనసాగుతున్న ఒక దీర్ఘకాలిక తలనొప్పి.”

“ఒత్తిడి, నిద్ర మరియు ఎన్విరాన్మెంటల్ కారకాలు మహిళల్లో ముఖ్యమైన ట్రిగ్గర్ కారకాలు మరియు పురుషులలో మాత్రం ఈ మైగ్రేన్ కి గల ఫ్యాక్టర్స్  ఆడవారితో పూర్తిగా విభేదిస్తాయి. ట్రిగ్గర్ కారకాలు maigrane తో బాధపడే వారిలో తరచూ ఉంటాయి మరియు వాటిని నివారించడం ఈ డిసార్డర్ యొక్క మెరుగైన నియంత్రణకు దారి తీయవచ్చు. చాలామంది మహిళలలో కూడా ముందుగానే లేదా ఋతుస్రావం సమయంలో కూడా తీవ్రమైన తలనొప్పిని చూస్తారు. కొంతమంది గర్భధారణ సమయంలో లేదా మెనోపాజ్ సమయంలో హార్మోన్-ప్రేరిత maigrane తో బాధపడతారు. మహిళల్లో ఈస్ట్రోజెన్ లెవెల్స్ లో  మార్పు కారణంగా ఇది సంభవిస్తుంది.

మెట్రో నగరాల్లో మైగ్రెన్ సాధారణంగా ఎక్కువగా ఉంటుందని వైద్యులు చెపుతున్నారు. కారణం “ఒత్తిడి, పని ఒత్తిడి, నైట్ షిఫ్ట్స్, నిద్ర లేకపోవడం మెట్రో నగరాల్లో మరింత ఎక్కువగా ఉంటుంది. వీటి ఫలితంగా మెట్రో జనాభాలో మైగ్రేన్ సంభవించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ”

ఈ మైగ్రేన్ నొప్పితో బాధపడుతున్న వ్యక్తులు తరచూ మెడిసిన్స్ యొక్క సహాయాన్ని తీసుకుంటారు, కానీ కేవలం మందుల నుండి కాకుండా, దీని ప్రభావాన్ని నియంత్రించే చాలా జీవనశైలి మార్పులు ఉన్నాయి. రెగ్యులర్ భోజనం, రోజులో కనీసం ఎనిమిది గ్లాసుల నీటిని తాగడం, సరిపడా సాధారణ నిద్రలను కొనసాగించడం, ఒత్తిడి తగ్గించడం మరియు కెఫీన్ ని తీసుకోవడం తగ్గించాలి.

ఈ మైగ్రేన్ ని అధిగమించడానికి నిపుణులచే సూచించబడిన కొన్ని ముఖ్యమైన ఆహార పదార్థాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం.

ఆకుపచ్చ ఆకు కూరలు (పాలకూర మరియు కాలే), పండ్లు (ఫిగ్స్ , అవోకాడో, అరటి మరియు రాస్ బెర్రీస్), లేగ్యుమ్స్ (నలుపు బీన్స్, చిక్పీస్ మరియు కిడ్నీ బీన్స్), సీ ఫుడ్ (సాల్మోన్, మేకెరెల్, ట్యూనా) మరియు క్రుసిఫెరస్ కూరగాయలు (బఠానీలు, బ్రోకలీ, క్యాబేజీ, ఆకుపచ్చ బీన్స్, ఆర్టిచోక్స్, ఆస్పరాగస్, బ్రస్సెల్స్ మొలకలు).

* సోయాబీన్స్, వైట్ బీన్స్, కందులు, బాదం, వే ప్రోటీన్ మరియు సంక్లిష్ట కార్బోహైడ్రేట్లతో  ఉన్న ఆహారం, మరియు ఫైబర్ వంటి కాల్షియం అధికంగా ఉండే ఆహారం తీసుకోండి.

* చెర్రీస్, క్రాన్బెర్రీస్, బేరి, ప్రూనే వంటి సిట్రస్ కాని పండ్లను తీసుకోవాలి. ఆపిల్స్, అరటిపండ్లు, పీచెస్ మరియు టమోటాలను కొంచెం తక్కువగా తీసుకోండి.

ఈ పైన చెప్పిన ఆహారపదార్థాలతో పాటుగా మన జీవన శైలిలో కొంచెం చిన్న చిన్న మార్పులు చేసుకుంటే ఈ మైగ్రేన్ బారి నుండి కొంతవరకు ఉపశమనం పొందవచ్చు.

Please follow and like us:
0

You may also like...

Leave a Reply

Your email address will not be published.

Enjoy this blog? Please spread the word :)