నేను ఈరోజు ఈ స్థానంలో ఉండడానికి కారణమైన దర్శక నిర్మాతలకు కృతజ్ఞతలు – తుమ్మలపల్లి రామసత్యనారాయణ

నేను ఈరోజు ఈ స్థానంలో ఉండడానికి కారణమైన దర్శక నిర్మాతలకు కృతజ్ఞతలు – తుమ్మలపల్లి రామసత్యనారాయణ*

తుమ్మలపల్లి రామసత్యనారాయణ 2004 లో సినిమా రంగంపై మక్కువతో ఇండస్ట్రీలో అడుగుపెట్టారు. తెలిసి తెలియక అనేకమంది చేతిలో మోసపోయిన ఆయన డబ్బు అంతా పొగుట్టుకున్నారు. అయినా సరే ఈ రంగంలో నిలదొక్కుకోవలని ఎలాగైనా సినిమాలు చెయ్యాలని ముందుకు కదిలారు. ఇండస్ట్రీలో ఒక నిర్మాత చిన్న సినిమా ప్లాప్ తీస్తే మళ్ళీ కనపడలేని పరిస్థితులలో చిన్న నిర్మాతలు వున్నారు. ఇలాంటి సినిమా ఫీల్డ్ లో ప్లాప్ ఐన సేఫ్ గా ఎలా ఉండాలని రామసత్యనారాయణ ఆలోచించరు. అందుకోసం బడ్జెట్ ని కంట్రోల్ పెట్టుకుని సినిమాలు తీస్తు వెళుతున్నారు. దాదాపు 97 చిత్రాలు నిర్మించిన ఆయన 98వ సినిమాగా శివ 143ని నిర్మించారు. 99 వ సినిమా అతి త్వరలో తనకు చాలా ఇష్టమైన దర్శకుడు ..వివాదాస్పద దర్శకుడు తో ప్లాన్ చేస్తున్నారు కధ రెడి అవుతుంది.

రామసత్యనారాయణ నటుడిగా లక్ష్మీనరసింహ.ఘంటాసాల గారి బయోపిక్ లాంటి సినిమాతో పాటు సుమారు 75 సినిమాలలో మంచి పాత్రల్లో కనిపించారు. ప్రస్తుతం శివ 143 సినిమాలో రాష్ట్రపతి పాత్రలో నటించడం జరిగింది. త్వరలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. అలాగే మరిన్ని సినిమాల్లో మంచి పాత్రలు రామసత్యనారాయణను వరిస్తున్నాయి. త్వరలో ఆ వివరాలు తెలుపుతారు. సినిమాల్లో వేషాలు, మంచి చిత్రాల నిర్మాణంలో ఆయన సంతోషంగా ఉన్నట్లు వెల్లడించారు.

100 వ చిత్రం శతాధిక చిత్రాల దర్శకుడు చేస్తాను అని మాట ఇచ్చారు ఆ అగ్ర దర్శకుడు. ఆయన పిలుపుకోసం
ఎదురు చూస్తున్నారు రామసత్యనారాయణ. తాను ఈ రోజు ఇలా ఉండటానికి కారణం ప్రముఖ నిర్మాత
కళ్యాణ్ గారి ఆసిస్సులు..
కోడి రామకృష్ణ గారి పరిచయం వల్లేనని ఆయన చెప్పుకోచ్చారు. కీర్తి శేషులు శ్రీ దాసరి గారి పరిచయం మరువలేనిదని ఆయన అంటారు. అలాగే శ్రీ కొణిజేటి రోశయ్య గారి సహకారం మరువలేనిదని ఆయన ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారు. తనని ఇష్టపడే దర్శకుడు, చాలా ఇష్టమైన దర్శకుడు..శ్రీ VV వినాయక్ గారు, శ్రీ రాంగోపాల్ వర్మ గార్లు అని ఆయన అన్నారు. ఈ రోజు ఇన్ని సినిమాలు తీసాను అంటే ఇంత మంది సపోర్టు ఉంది వారికి కృతజ్ఞతలని ఆయన తెలిపారు.

Please follow and like us:
0

You may also like...

Leave a Reply

Your email address will not be published.

Enjoy this blog? Please spread the word :)