సార్థక్ మూవీస్ ద్వారా వరుస సక్సెస్ ఫుల్ సినిమాను అందిస్తున్న నిర్మాత ప్రశాంత్ గౌడ్.

సార్ధక్ మూవీస్ బ్యానర్ లో నిర్మాత ప్రశాంత్ గౌడ్ ఇదివరకు మంచు విష్ణు ఓటర్, అంజలి లీసా, సప్తగిరి వజ్ర కవచధర గోవిందా చిత్రాలను డిస్ట్రిబ్యూషన్ చేసారు. తాజాగా విశాల్, రాశిఖన్నా జంటగా నటించిన అయోగ్య చిత్రాన్ని తెలుగులో విడుదల చేస్తున్నారు. ఈ సినిమాతో పాటు అమలపాల్ ప్రధాన పాత్రలో వస్తోన్న ఆమె సినిమాను తెలుగు ప్రేక్షకులకు అందించబోతున్నారు. గతంలో ప్రశాంత్ గౌడ్ రామ్ గోపాల్ వర్మ, భూమిక సినిమాకు వర్క్ చెయ్యడం జరిగింది. లగడపాటి శ్రీధర్ అబ్బాయి హీరోగా నటించిన ఎవడు తక్కువకాదు, అలాగే గజేంద్రుడు సినిమాలు డిస్ట్రిబ్యూషన్ చేశారు. గజేంద్రుడు సినిమా మంచి విజయం సాధించిన సంగతి తెలిసిందే.

వరుస సక్సెస్ ఫుల్ సినిమాలు తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్న నిర్మాత ప్రశాంత్ గౌడ్ నుండి మరిన్ని మంచి సినిమాలు రానున్నాయి. ఒకే నెలలో ఆరు హిట్ చిత్రాల పంపిణీ చేయడం విశేషం. డిస్ట్రిబ్యూషన్ శాఖలో ఇది అరుదైన ఘనతగా చెప్పుకోవచ్చు.

విశాల్‌ హీరోగా తమిళంలో రూపొందిన `అయోగ్య` చిత్రం తెలుగులో అదే టైటిల్‌తో విడుదల కానుంది. ఏ.ఆర్.మురుగ‌దాస్ శిష్యుడు వెంకట్‌ మోహన్ ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. విశాల్ స‌ర‌స‌న రాశీఖన్నా కథానాయికగా నటించారు. `ఠాగూర్‌` మధు తొలిసారి తమిళంలో నిర్మించిన ఈ చిత్రం తెలుగు హక్కుల్ని సార్థక్ మూవీస్ అధినేత ప్ర‌శాంత్ గౌడ్ సొంతం చేసుకున్నారు. ప్రస్తుతం అనువాద కార్యక్రమాలు పూర్తయ్యాయి. ఈనెల 12న సినిమాని తెలుగు రాష్ట్రాల్లో అత్యంత క్రేజీగా రిలీజ్ చేయ‌నున్నారు.

ఈ సంధర్బంగా నిర్మాత ప్ర‌శాంత్ గౌడ్ మాట్లాడుతూ -“ `అయోగ్య` త‌మిళంలో ఘ‌న‌విజ‌యం సాధించింది. అక్క‌డా బాక్సాఫీస్ వ‌ద్ద చ‌క్క‌ని వ‌సూళ్ల‌తో అద‌ర‌గొట్టింది. త‌మిళ క్రిటిక్స్ ఈ చిత్రానికి 3.5 రేటింగులు ఇచ్చి ప్ర‌శంస‌లు కురిపించారు. విశాల్ ఎన‌ర్జీ లెవ‌ల్ ని ప‌దింత‌లు చూపించిన సినిమా ఇది. అలాగే ఈ సినిమాలో క్లైమాక్స్ సినిమాకే హైలైట్. త‌మిళ‌నాడులో జ‌రిగిన ఓ య‌థార్థ ఘ‌ట‌న ఆధారంగా ప‌తాక స‌న్నివేశాల్ని ద‌ర్శ‌కుడు తీర్చిదిద్దారు. త‌మిళంలో హిట్ట‌యిన ఈ చిత్రాన్ని తెలుగులో మా సార్థక్ మూవీస్ ద్వారా రిలీజ్ చేస్తుండ‌డం ఆనందాన్నిస్తోంది. తెలుగులో విశాల్ న‌టించిన సినిమాల‌న్నీ వ‌రుస‌గా విజ‌యాలు అందుకుంటున్నాయి. ఆ కోవ‌లోనే అయోగ్య ఘ‌న‌విజ‌యం సాధిస్తుంద‌న్న న‌మ్మ‌కం ఉంది. ఈనెల 12న ఏపీ- నైజాంలో రిలీజ్ చేస్తున్నాం“ అని తెలిపారు.

Please follow and like us:
0

You may also like...

Leave a Reply

Your email address will not be published.

Enjoy this blog? Please spread the word :)