pradeep pellichupulu creating nonsense

ప్రదీప్ పెళ్ళి చూపులు ప్రోగ్రాం కి చిక్కుల మీద చిక్కులు

రియాలిటీ షో లతో తనకంటూ ఒక పేరు సంపాదించుకున్న ప్రదీప్ మాచిరాజు పేరు పాడు కావడానికి ఎంతో సేపు పట్ట లేదు, మొన్న తాగి డ్రైవింగ్ కేస్ నుండి బయట పడక ముందే , ఈ షో ద్వారా భాగస్వామి ఎంపిక అంటు ప్రచారం చేసి షో ని పాపులర్ చేశాడు. ఈమధ్యన మొదలైన ఈ షో పట్ల ఆసక్తి ని మొదట ప్రేక్షకులు కనబరచినా షో లో వల్గారిటి ని,సంప్రదాయ విరుద్దంగా ఆడవాళ్ళతో అసభ్యం గా ఉండటం వంటివి షో మీద నెగెటివ్ పెంచాయి. సోషల్ మీడియా వేదికగా నిర్వాహకులకు షో ని ఆపమని చాలా మంది సందేశం ఇచ్చారు. దాంతో ఈ నెల 9నుండి ఆపేస్తున్నట్లు సమాచారం
అయితే ఇంతలోనే కర్నూల్ జిల్లా కలెక్టర్ ఆఫీస్ ముందు నేడు రాయలసీమ మహిళా సంఘ్ ప్రతినిధులు ఈ ప్రోగ్రాం అశ్లీలతమీద కలెక్టర్ కి ప్రదీప్ , యాంకర్ సుమ, నిర్వాహకుల మీద క్రిమినల్ యాక్ట్ పరంగా చర్యలు తీసుకోవాలని వినతి పత్రం ఇచ్చారు.
ఏదేమైనా ప్రదీప్ షో అటు నిర్వాహకులను ఇటు ప్రేక్షకులను నిరాశ పరచింది .

Please follow and like us:
0

You may also like...

Leave a Reply

Your email address will not be published.

Enjoy this blog? Please spread the word :)