బుల్లి ఫ్యాన్ కోరికను తీర్చిన “బాహుబలి”

సినిమా హీరోలంటే ఎవరికి మాత్రం ఇష్టం ఉండరు. ఒక్కొక్కరికి ఒక్కో హీరో అంటే అభిమానం ఉంటుంది. ఈ అభిమానానికి వయసుతో సంబంధం లేకుండా చిన్నపిల్లలు మొదలుకుని పెద్దల వరకు అందరూ అభిమానులే. ఆ అభిమానం కేవలం అభిమానులకు మాత్రమే కాదు, హీరోలు కూడా వారి ఫాన్స్ కి ఎంతో విలువ ఇస్తారు. సమాజానికి తమ అవసరం ఉన్నప్పుడు మన టాలీవుడ్ హీరోస్ ఎప్పుడు ముందుంటారు. తమ అభిమానులకు ఏదైనా సమస్య వచ్చినప్పుడు లేదా ప్రాణాపాయ స్థితిలో ఉన్నప్పుడు వాళ్ళను కలిసి వారి క్షేమ సమాచారం తెలుసుకొని కావలసిన సహాయం చేయడంలో రెడీగా ఉంటారు. మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్, పవన్ కళ్యాణ్ వీరంతా తమని చూడాలి అని కోరుకున్న అభిమానిని స్వయంగా వెళ్లి కలుసుకోవడం మనకు తెలుసు.

ఇప్పుడు బాహుబలి ప్రభాస్ వంతు వచ్చింది. బాహుబలితో అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న హీరో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్. మదన్ అనే చిన్నపిల్లాడు ఓ  అంతుచిక్కని వ్యాధితో బాధ పడుతూ చికిత్స తీసుకుంటున్నాడు. ఈ బాబు ప్రభాస్ కి అభిమాని. ఎలాగైనా ఒక్కసారి తన హీరోని కలుసుకోవాలని తల్లితండ్రులను అడుగుతూ ఉండేవాడు. ఆసుపత్రిలోని బెడ్‌పై కూర్చుని ‘ఐ వాంట్ టు మీట్ బాహుబలి’ అనే ఫ్లకార్డ్  పట్టుకొని ఆ బాలుడు దిగిన ఒక ఫొటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ విషయాన్ని తెలుసుకున్న ప్రభాస్ ఫాన్స్ ఆ విషయాన్ని తమ హీరోకి తెలియచేసారు.

ప్రభాస్ వెంటనే చిట్టి అభిమానితో కలిసి కాసేపు సరదాగా గడిపాడు. ఈ సందర్భంగా బాహుబలి స్టార్ బాలుడి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. అతనితో కలిసి ఫొటోలు దిగాడు. ఈ ఫొటోల్ని ప్రస్తుతం అతని అభిమానులు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. నిజంగా ఇది చాలా మంచి విషయం. ప్రభాస్ ఇప్పుడు సాహో  సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు. శ్రద్ధా కపూర్ హీరోయిన్ గా నటిస్తుంది. దీనికి సుజీత్ దర్శకత్వం వహిస్తున్నాడు. రామోజీ ఫిలిం సిటీలో షూటింగ్ జరుగుతుంది. ఈ సినిమాలో ప్రభాస్ వజ్రాల దొంగగా నటిస్తున్నాడని ఇండస్ట్రీ టాక్. ఈ చిత్రాన్ని రూ. 300 కోట్ల బడ్జెట్‌తో యూవీ క్రియేషన్స్ నిర్మిస్తోంది. జాకీష్రాఫ్‌, నీల్ నితిన్ ముఖేష్‌, అరుణ్ విజయ్, ఎవలీన్ శర్మ, వెన్నెల కిషోర్ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. 2019లో సాహో సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

 

 

Please follow and like us:
0

You may also like...

Leave a Reply

Your email address will not be published.

Enjoy this blog? Please spread the word :)