technology information

Be careful about data Stealing apps in telugu

Be careful about data Stealing apps in Telugu

Be careful about data Stealing apps in telugu

స్మార్ట్ ఫోన్ తో ప్రపంచం మొత్తం మన అర చేతిలోకి వచ్చి చేరింది. ఆ పైన పెద్ద పెద్ద సంస్థలు, రోజూవారీ లావాదేవీలు సైతం యాప్ల రూపంలో ఇమిడిపోయేసరికి స్మార్ట్ ఫోన్ వినియోగం మరింత పెరిగింది. ఆ పైన చౌకగా లభిస్తున్న ఇంటర్నెట్ డేటా వల్ల ఫోనులో బోలెడన్ని యాప్లు అవసరం ఉన్నా లేకున్నా డౌన్లోడ్ చేసేస్తున్నాం. కానీ అలా చేసిన యాప్లు రహస్యంగా మన ఫోన్ ఆక్టివిటీ మొత్తాన్ని వీడియోలు తీసి మరీ మూడో పార్టీ కి చేరవేస్తుoటాయని మీకు తెలుసా.

అది వరకు వాట్స్ఆప్ లో కూడా ఫోన్ సమాచారం ఇతరులకు చేరుతోందని ఫిర్యాదులు రావడంతో దానిని ప్రస్తుతం end-to-end transcription చేసారు. కొద్ది కాలం క్రితం facebook పై కూడా ఇలాంటి ఫిర్యాదులే వచ్చాయి. ఫోన్ లోని కాల్స్ లో మన సంభాషణ విని దానికి తగ్గ యాడ్లు facebook లో కనిపిస్తున్నాయని ఫిర్యాదులు వెల్లువెత్తాయి. అయితే దీనికి సంబంధించి facebook సంస్థ ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఇలా వాట్స్ఆప్, ఫేస్బుక్, zomato వంటి ఎన్నో యాప్ల ద్వారా వినియోగదారుల పూర్తి సమాచారం థర్డ్ పార్టీ గుప్పిట్లోకి చేరిపోతోంది అనడం మాత్రం నగ్న సత్యం.

ఎవరికి లాభం: ఇలా ఫోన్ నుండి సేకరించిన సమాచారాన్ని ఎవరికి చేరుతోంది, దాని వల్ల ప్రయోజనం ఏంటి అనుకుంటున్నారా. వీటిని డేటా అనలిటిక్స్ మరియు డేటా సంస్థలు కొనుగోలు చేస్తాయి. అలా చేసి వినియోగదారులకు తగ్గ సమాచారాన్నే తిరిగి మన స్కీన్ పై ప్రత్యక్షం అయ్యేలా చేస్తారు. ఇంత వరకు అయితే పర్లేదు, కానీ వారి చేతిలో మన personal ఎకౌంటు పాస్వర్డ్లు, photoలు, వీడియోలు అన్నీ ఉంటాయి అన్నది మరచిపోకూడదు. ఈ data సంస్థలు ఈ సమాచారాన్ని ఎలా వాడుకుంటున్నాయి అన్నది చెప్పడం మాత్రం కష్టం.

ఒక యాప్ రూపొందించడం చాలా తేలిక అయిపొయింది. దానిని డౌన్లోడ్ చేసేటప్పుడు కూడా మన ఫోన్ లో photos, కాల్స్, టెక్ష్ట్స్, ఇంకా చాలా వాటికి అనుమతి అడుగుతుంది. మనం ఏ మాత్రం ఆలోచించకుండా అనుమతించడంతో ఇలా మన వ్యక్తిగత సమాచారం అంగట్లో సరుకు అయిపోతోంది.

ఇక పై లేని పోనీ యాప్లు, ఆటలు డౌన్లోడ్ చేసుకునే ముందు ఒక్క క్షణం ఆలోచిoచండి. విచక్షణ పాటించండి.

Tags

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button