అల్లు అరవింద్ తీసుకోస్తున్న పేపర్ బాయ్

దర్శకుడిగా మంచి పేరు సంపాదించుకున్న శోభన్ కొడుకు సంతోష్ శోభన్ “తను నేను“ అనే మూవీతో తెలుగు తెరకు హీరోగా పరిచయమయ్యాడు. ఈ సినిమా 2015 లో విడుదలఅయ్యింది. ఇప్పుడు తిరిగి మూడు సంవత్సరాల తర్వాత సంతోష్ తిరిగి “పేపర్ బాయ్” సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. మాస్‌ డైరెక్టర్‌గా విజయాన్ని అందుకున్న సంపత్‌ నంది ఇప్పుడు చిన్న సినిమాలను నిర్మిస్తున్నాడు. డైరెక్టర్ సంపత్ నంది ఈ సినిమాను సంపత్ నంది టీమ్ వర్క్స్ బ్యానర్ పై కొత్త దర్శకుడు జయశంకర్ డైరెక్ట్ చేసిన చిత్రం ‘పేపర్ బాయ్’. ఈ సినిమా ఈ నెల 31న విడుదలకానుంది. రియా సుమన్ హీరోయిన్ గా నటిస్తుంది. తాన్య హోప్ ఒక కీలక పాత్రలో నటించారు. ఈ చిత్రానికి భీమ్స్ సంగీతాన్ని అందించారు.

ఇప్పటికే రిలీజ్ అయిన ఈ మూవీ ప్రోమోస్ సినిమాపై అంచనాలను ఇప్పటికే పెంచాయి. అంతేకాదు ప్రిన్స్ మహేష్ బాబు కూడా ఈ చిత్ర ట్రైలర్ కి మoచి కితాబు ఇచ్చారు. తాజాగా ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. సెన్సార్ బోర్డ్ వారు క్లీన్ యు సర్టిఫికేట్ ఇచ్చారు. ఈ సినిమాని రొమాంటిక్ డ్రామాగా తెరకెక్కించారు. ఐతే అంతా బాగున్నప్పటికీ ఇలాంటి చిన్న సినిమా ప్రేక్షకుల దృష్టిని ఏమాత్రం ఆకర్షిస్తుంది, వాళ్లను థియేటర్లకు రప్పించుకొని హిట్ కొట్టగలదా అని సందేహం మాత్రం చిత్రయూనిట్ లో ఉంది.

తాజాగా సంపత్ నంది ఈ సినిమా స్పెషల్ స్క్రీనింగ్ ని నిర్మాతలు అల్లు అరవింద్ -బన్నీ వాస్ డైరెక్టర్ మెహర్ రమేష్ లకు ఏర్పాటు చేశాడట.  ఈ సినిమా చూసిన తర్వాత అల్లు అరవింద్ ఈ సినిమాను గీతా ఆర్ట్స్ బ్యానర్ పై రిలీజ్ చేసేందుకు నిర్ణయించుకొని టోటల్ థియేట్రికల్ రైట్స్ తీసుకున్నారట. ఈ విషయాన్ని సంపత్ నంది తన ట్విట్టర్ అకౌంట్  ద్వారా తెలిపాడు. గీతా ఆర్ట్స్ టీం తమ సినిమా కంటెంట్, డైలాగ్స్, నటీనటుల పెర్ఫార్మన్స్ ను మెచ్చుకోవడం చాలా సంతోషంగా ఉందని సంపత్ ట్విట్టర్ లో తెలిపాడు.

అల్లు అరవింద్ సినిమాను మెచ్చి గీతా ఆర్ట్స్ బ్యానర్ లో రిలీజ్ చేయడానికి ముందుకు రావడంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో అంచనాలు పెరిగాయి. ‘గీత గోవిందం’ సూపర్ హిట్ అందుకున్న ఆనందంలో ఉన్న గీతా ఆర్ట్స్ బ్యానర్ నుండి రాబోతున్న ‘పేపర్ బాయ్’ పై మరింతగా హైప్ పెరిగింది.  దీనితో చిన్న సినిమా ‘పేపర్ బాయ్’కి గొప్ప సపోర్ట్ అందినట్టయ్యింది. ఈ చిత్ర వరల్డ్ వైడ్ థియేట్రికల్ హక్కుల్ని గీతా ఆర్ట్స్ కొనుగోలు చేశారు. తమ బేనర్ ద్వారా సినిమాను రిలీజ్ చేయబోతోంది.

గీతా ఆర్ట్స్-2 బేనర్ ద్వారా కొన్నేళ్లుగా చిన్న, మీడియం రేంజి సినిమాలు నిర్మిస్తున్నారు అరవింద్. దీనితో పేపర్ బాయ్ కి థియేటర్ల ఇబ్బంది కూడా ఉండదు. దీంతో సినిమాకు మంచు రిలీజ్ దక్కనుంది. సురేష్ ప్రొడక్షన్స్ కూడా వేరే వారు తీసిన సినిమాను స్క్రిప్ట్ నచ్చడంతో ‘పెళ్ళిచూపులు’,‘మెంటల్ మదిలో’ లాంటి సినిమాల్ని తమ బ్యానర్ లో రిలీజ్ చేసారు. ఇప్పుడు ‘కేరాఫ్ కంచెర్ల పాలెం’ను కూడారిలీజ్ చేస్తున్నారు. కాని మొదటిసారి గీతా ఆర్ట్స్-2 కూడా ఇదే బాటలో నడిచి ‘పేపర్ బాయ్’ హక్కుల్ని తీసుకుంది. మరి ఇంత పెద్ద బ్యానర్ సపోర్ట్ తో రిలీజ్ కాబోతున్న పేపర్ బాయ్ రిజల్ట్ ఎలా ఉండబోతుందో చూడాలంటే ఈ శుక్రవారం వరకు ఆగాల్సిందే.
 

Please follow and like us:
0

You may also like...

Leave a Reply

Your email address will not be published.

Enjoy this blog? Please spread the word :)