రేపటి నుండి ఇండియన్ మార్కెట్ లో లాంచ్ కానున్న Oppo F9 ప్రో

Oppo కంపెనీ ఆగష్టు 21 అంటే రేపు ఇండియాలో F9 ప్రోని లాంచ్ చేయనుంది. కంపెనీ ఈ త్వరలో రాబోయే స్మార్ట్ ఫోన్ కోసం కొన్ని వారాల ముందు నుండే ఒక మంచి హైప్ ని క్రియేట్ చేసింది. ఈ ప్రక్రియలో దాని గురించి కొన్ని కీలక వివరాలు వెల్లడించాయి. Oppo ఈ ఫోన్ ని సీక్రెట్ గా ఉంచకుండా లాంచ్ కి ముందే  దాని చాలా ప్రత్యేకమైన డిజైన్ ని పబ్లిక్ కి చూపించారు. F9 ప్రో రేపు భారతదేశంలో లాంచ్ అవుతున్నప్పటికీ Oppo ఇప్పటికే వియత్నాం మరియు ఫిలిప్పీన్స్ వంటి కొన్ని ప్రదేశాలలో F9 ప్రో ని లాంచ్ చేసింది. అయితే రెండు ఫోన్ల హార్డ్ వేర్ లో కొన్ని నిగూఢమైన డిఫెరెన్సెస్ సమానంగా ఉంటాయి.

Oppo F9 ప్రో డిస్ప్లే కట్ అవుట్ తో వస్తుంది. కాని అది చాలా ఆండ్రాయిడ్ ఫోన్లు మరియు ఐఫోన్ X లో ఇప్పటి వరకు చూసిన వాటిలా కాకుండా దీనిలో ఒక గీత ఉంది. కంపెనీ దాని ట్రేడ్ మార్క్ VOOC ఫాస్ట్ ఛార్జ్ , అలాగే దాని కలర్ ఆప్షన్స్ మరియు కొన్ని హార్డ్ వేర్ లక్షణాలు, అలాగే, F9 వలె దాదాపు సౌండ్ కూడా ఒకే విధంగా ఉంటాయి.

Oppo కంపెనీ డిజైన్ యొక్క మెయిన్ USP గా F9 ప్రో యొక్క డిజైన్  హైలైట్ చేస్తుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఈ ఫోన్ లో Oppo ఒక నీటి బిందువు ఆకారంలో ఒక గీతతో పాటు ఎడ్జ్ టుఎడ్జ్ డిస్ప్లే అది ఒక నీటి బిందువు ఆకారంలో ఉంటుంది. మరియు ఇది స్క్రీన్ పై నీటిని తీసుకువచ్చినట్టు కనపడుతుంది. ఈ గీత చాలా ప్రత్యేకమైనది మరియు ఈ సంవత్సరంలో వచ్చిన చాలా ఆండ్రాయిడ్ ఫోన్లలో చూసినట్లు కాకుండా.

ఒక  చిన్న గీత మరియు నారో చిన్ ఫోన్ లో చాలా డిస్ ప్లే కి అనుమతిస్తుంది. Oppo F9 ప్రో 90.8 శాతం స్క్రీన్ టు బాడీ రేషియోతో వస్తుంది అని చెప్పారు. చాలా F9 మోడల్ ఫోన్స్ వలె, F9 ప్రో ఒక 19.5: 9 యాస్పెక్ట్ రేషియోతో 6.3 అంగుళాల FHD + డిస్ ప్లేతో వస్తాయి అని భావిస్తున్నారు.

Oppo F9 లేటెస్ట్ గొరిల్లా గ్లాస్ 6 ప్రొటెక్షన్ తో వచ్చిన మొదటి స్మార్ట్ ఫోన్ మరియు F9 ప్రో కూడా అదే విధమైన గ్లాస్ తో వస్తుంది. క్వాల్కమ్ ఈ న్యూ గ్లాస్ 15 డ్రాప్స్ నుండి 1 మీటర్ హైట్ నుండి సర్వైవ్ అవుతుందని తెలిపారు.

ప్రత్యేకమైన డిస్ప్లే తో పాటు, F9 ప్రో కూడా కొన్ని ఆకర్షణీయమైన కలర్ ఆప్షన్స్ తో వస్తుంది. ఈ స్మార్ట్ ఫోన్ పర్పుల్, సన్ రైస్ రెడ్ మరియు ట్వైలైట్ బ్లూ అనే మూడు రంగులలో లభిస్తాయి అని వెల్లడించింది. అన్ని మూడు ఆప్షన్స్ ఒక గ్రేడియంట్ డిజైన్ ని కలిగి ఉంటాయి. అంటే కలర్స్ యొక్క కాంబినేషన్ ని చూసినప్పుడు యాంగిల్ పైన డిపెండ్ అయ్యి మరియు లైట్ హిట్ అయినప్పుడు ఇది మారుతుంది. అదనంగా, రెడ్ మరియు బ్లూ కలర్స్ కలిసి డైమండ్ షేప్ పాట్రన్స్ వెనుక వైపు ఏర్పడతాయి. అయితే పర్పుల్ రంగు ఆప్షన్ నైట్ స్కై రిఫ్లెక్ట్ వల్ల ఒక స్టార్- స్టడేడ్ పాటర్న్ నమూనాను కలిగి ఉంటుంది.

చాలా F9 మోడల్ వలె, F9 ప్రో ఒక ఆక్టా- కోర్ మీడియా టెక్ Helio P60 చిప్ సెట్ పవర్ చేయబడి ఉంటుంది. Oppo ఒక AI బ్యాటరీ మేనేజ్ మెంట్ ఫీచర్ ని కలిగి ఉంటుంది. F9 4GB RAM తో మాత్రమే ప్రకటించారు అయితే, Oppo F9 ప్రో 64GB ఇంటర్నల్ స్టోరేజ్ తో పాటు 6GB మెమరీ పొందుతారు అని ధ్రువీకరించారు.

F9 ప్రో యొక్క గీత Oppo F7 మరియు F9 పోలి 25 మెగాపిక్సెల్ AI సెన్సార్ తో ఉంటుంది. అదనంగా, కెమెరా సెన్సార్ HDR అని కంపెనీ పిలిచే దానికి సపోర్ట్ ఇస్తుంది, ఇది Oppo F7 లో కూడా కనిపించే ఫీచర్.

 

Oppo F9 ప్రో వెనుక కెమెరా యొక్క specs ఇంకా రివీల్ చేయాల్సి ఉంది, కానీ ఈ డివైస్ F9 పోలి ఉంటే అప్పుడు ఒక 16MP + 2MP కాన్ఫిగరేషన్ ఉంటుందని ఊహించుకోవచ్చి. ప్రైమరీ కెమెరా f / 1.9 అపేర్చ్యుర్ తో వస్తుంది, అయితే సెకండరీ కెమెరా డెప్త్ సెన్సింగ్ కోసం ఉపయోగించబడుతుంది.

Oppo 15 నిమిషాల ఛార్జ్ తరువాత 2 గంటల సేపు మాట్లడుకునేలా చేసే సూపర్ ఫాస్ట్ VOOC ఫ్లాష్ ఛార్జ్ సపోర్ట్ హైలైట్ చేస్తోంది. ఇది మీరు OnePlus ‘డాష్ ఛార్జర్ కి  సమానంగా ఛార్జింగ్ స్పీడ్ ని చూడవచ్చని అర్థం. ఫోన్ 3,500mAh బ్యాటరీని కలిగి ఉంటుంది.

Please follow and like us:
0

You may also like...

Leave a Reply

Your email address will not be published.

Enjoy this blog? Please spread the word :)