ఆ ఒక్క ట్వీట్ కోప ముంచిందిగా!

ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్ చిత్రాలకు సినిమాటోగ్రఫీని అందించి ఒక్క తమిళ ప్రేక్షకులకు మాత్రమే కాకుండా తెలుగు, కన్నడ, మళయాళo హిందీ ప్రేక్షకులకు సుపరిచితుడు అయిన సినిమాటోగ్రాఫర్ santosh shivan. ఈయన కేవలం సినిమాటోగ్రఫర్ గానే కాకుండా డైరెక్టర్, ప్రొడ్యూసర్ , యాక్టర్ గా కూడా రాణించాడు. ఎన్నో గొప్ప గొప్ప వార్డులు రివార్డులు అందుకున్నాడు. ఇప్పటివరకు 45 సినిమాలకు సినిమాటోగ్రఫీని అందించాడు మరియు 41 డాకుమెంటరీస్ కూడా తీసాడు. ఇండియన్ సొసైటీ అఫ్ సినిమాటోగ్రఫర్స్ లో ఒక మెంబెర్ కూడా. అంతేకాకుండా ఇండియాలో డైరెక్టర్ అఫ్ ఫోటోగ్రఫీలో ఎక్కువ అవార్డులు దక్కించుకున్న వ్యక్తీ సంతోష్ శివన్. ఈయన దేశంలోనే అత్యున్నత పురస్కాం అయిన పద్మశ్రీని కూడా అందుకున్నారు. అంతర్జాతీయ టెక్నాలజీని వినియోగించి తాను పని  చేసే సినిమాలకు బెస్ట్ ఔట్ పుట్ ఇచ్చే దిట్ట సంతోష్ శివన్. అలాంటి వ్యక్తీ ఇప్పుడు ఇరుకున పడ్డాడు.

santosh shivan సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటారు. ఇప్పుడు అదే ఆయన కోప ముంచిందనే చెప్పాలి. తాజాగా ఆయన చేసిన ఒక ట్వీట్ ఆయన కెరీర్ నే ప్రమాదంలోకి నెట్టే పరిస్థితికి తీసుకువచ్చింది. దానికి కార‌ణం ఆ ట్వీట్ నిర్మాత‌ల‌ను హేళన చేసి కించ‌ప‌రిచేలా ఉండ‌డ‌మే.
సంతోష్ శివన్ ట్విట్టర్ లో ఒక మెమెను పోస్ట్ చేసారు. అందులో నిర్మాతలు సినిమాకు వర్క్ చేసిన టెక్నీషియన్స్ కి పారితోషికం ఇచ్చే సమయంలో కోపంగా ఉన్న కుక్క అంటూ ఒక కుక్క పేస్ ఎక్స్ప్రేషన్, అదే నిర్మాతలు హీరోయిన్స్ కు పారితోషికం ఇచ్చే సమయంలో నవ్వుతూ ఉన్న కుక్క అంటూ ఒక కుక్క పేస్ ఎక్స్ప్రేషన్ ఉన్న ఫోటోలను ఫొటోలను పోస్ట్ చేసారు.ఈ విధంగా ఆ మెమె వివాదానికి కారణం అయ్యింది. దాన్ని ఓ నిర్మాత చూసి, తమిళ నిర్మాతల మండలికి పంపించారు.

ఒక ప్రముఖ టెక్నీషియన్ అయ్యి ఉండి santosh shivan ఇలాంటి కామెంట్స్ చేయడంపై నిర్మాతలు ఆగ్రహంతో ఉన్నారు. దాంతో అక్కడి మండలి కార్యవర్గం నిన్న అత్యవసరంగా సమావేశం అయ్యింది. ఈ భేటీలో సంతోష్ శివన్ పై చర్యలు తీసుకునే అవకాశం ఉందని వార్తలు వినిపిస్తున్నాయి. కొందరు నిర్మాతలు తమిళ ఇండస్ట్రీ నుండి ఆయన్ను బ్యాన్ చేయాలంటూ ఉండగా మరి కొందరు మాత్రం మొదటి తప్పుగా వార్నింగ్ ఇచ్చి వదిలేయాలని అంటున్నారు. ఇప్పుడు నిర్మాతల మండలి తీసుకోబోతున్న నిర్ణయంపై సంతోష్ శివన్ కెరీర్ ఆధారపడి ఉంటుందని తమిళ మీడియా వర్గాల వారు అంటున్నారు. కానీ సంతోష్ శివన్ ఆ ట్వీట్ ను అర్జెంట్ గా డిలీట్ చేసేసారు. కానీ అప్పటికే ఆ ట్వీట్ వైరల్ అయిపోయి తమిళ నిర్మాతల ఆగ్రహనికి సoతోష్ శివన్ గురికావలసి వచ్చింది.

 

Please follow and like us:
0

You may also like...

Leave a Reply

Your email address will not be published.

Enjoy this blog? Please spread the word :)