telugu gods devotional information in telugu

గణపతి యొక్క అవయవాలు ఇచ్చే సందేశం

om sri ganeshaya namaha

అందరికి విఘ్నాలను హరించే దేవుడు , చివరికి దేవతలకు సైతం విఘ్నాలు తొలగించి శుభాలు కలిగించే వరద మూర్తి వినాయకుడు. లోక కళ్యాణం కోసం పార్వతి మాత నలుగు నుండి ప్రాణం పోసుకున్న ఈయన తర్వాత కారణాంతరాలచేత , అవతార విశేషాలు సంతరించుకోవడం కోసం ఏనుగు ముఖం ధరిస్తాడు. దాని వెనక మరొక గాథ ఉంది.
     గణపతి తాను ధరించిన అవతారం ద్వారా భక్తులు అయిన మనకు కేవలం రూపం ద్వారానే ఎన్నో సందేశాలు అందిస్తున్నాడు. ఉదాహరణ కి ఏనుగు ముఖం . . ఏనుగు ముఖంలో చూస్తే నోరు అనేది కనబడదు. . అనగా అనవసర విషయాలు , అర్దం లేని విషయాలు మాట్లాడకుండా అవసరమైన చోట మాత్రమే వాక్కు వాడమని దాని అర్దం

ఇకపోతే ఏక దంతం , ఒకానొక సమయాన లోక కళ్యాణం కోసం వ్యాసుని మహాభారత రచన సమయాన కలం గా ఉపయోగించాడు . . దీని ద్వారా స్వామి ఇచ్చే సందేశం లోకోన్నతి కోసం వీలయితే నిస్వార్థం గా మనము ఏదైన త్యాగం చేయాలి అని

   చిన్న కళ్ళు మితిమీరిన ఏకాగ్రత కి చిహ్నం   అనగా ఏదైనా విషయాన్ని మన తెలివి కన్నా ఎక్కువ గ్రహించగలగాలి అని , పెద్ద చెవులు మాట్లడటం కన్నా ఎక్కువ వినగలిగితే ఎక్కువ నేర్చుకునే అవకాశం ఉంటుందని తెలుపుతాయి. అందుకే అయన దేవతలకు మాత్రమే కాక మనకు కూడ ఆది పూజితుడు అయినాడు. అటువంటి గణపతి కి వేవేల నమస్కృతులిడుతూ . . .
Tags

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button